మోడీ భయంతోనే కేసీఆర్ ముందస్తు ఎన్నికలు - బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ విమర్శ

                               

Last Updated : Oct 4, 2018, 06:03 PM IST
మోడీ భయంతోనే కేసీఆర్ ముందస్తు ఎన్నికలు - బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ విమర్శ

తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయంపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవిఎల్ తీవ్రంగా స్పందించారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ అసెంబ్లీని ఎందుకు రద్దు చేశారో కేసీఆర్ చెప్పలేకపోతున్నారు...దీనిపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పడానికి కూడా ఆయన జంకుతున్నారని విమర్శించారు. ప్రధాని మోడీ భయంతో కేసీఆర్ ముందస్తు ఎన్నికలు వెళ్లారన్న జీవిఎల్..  మే నెలలో లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగితే మోదీ ప్రభంజనంలో కొట్టుకుపోతామనే భయంతో ఇలా చేశారని పేర్కొన్నారు... కేసీఆర్ అందుకే హడావుడిగా అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని డిసైడ్ అయ్యారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ ఎద్దేవ చేశారు. 

ఇంటింటికి వెళ్లి కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి..
తెలంగాణ ప్రజలకు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నేరవేర్చడంలో టీఆర్ఎస్ సర్కార్ పూర్తిగా విఫలమైంది.  హామీలు నెరవేర్చనందుకు సీఎం కేసీఆర్ తెలంగాణలోని ప్రతి ఇంటికి వెళ్లి క్షమాపణలు చెప్పాలని  ఈ సందర్భంగా జీవిఎల్ డిమాండ్ చేశారు. ముందు నుంచి తెలంగాణ కోరిన ఏకైక పార్టీ.. ఒక్క బీజేపీయేనని..వచ్చే ఎన్నికల్లో బీజేపీకి తెలంగాణ ప్రజలు బ్రహ్మరథం పడతారని జీవీఎల్ ఆశాభావం వ్యక్తం చేశారు.

అది తెలంగాణ ద్రోహుల కూటమి
మహాటకూటమిలో ఉన్న టీడీపీ,కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ ఏర్పాటుకు అడ్డుతగిలారనే విషయాన్ని తెలంగాణ ప్రజలతో పాటు యావత్ ప్రపంచానికి తెలుసు.. ప్రజలు ఎవరూ దీన్నిఎప్పుటికీ మరిచిపోరని విమర్శించారు. వాస్తవానికి అది మహాకూటమి కాదని..తెలంగాణ ద్రోహుల కూటమి అని ఎద్దేవ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి శూన్యమని.. చంద్రబాబు హయంలో అన్నీ అప్పులే ఉన్నాయని చెప్పారు. ఏపీలో విఫలమైన పార్టీతో కాంగ్రెస్ జత కట్టడాన్నితెలంగాణ ప్రజలు హర్షించని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు పేర్కొన్నారు.

Trending News