వేగంగా బావిలోకే దూసుకెళ్లిన కారు

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వేములకొండ క్రాస్ రోడ్ వద్ద సోమవారం వేగంగా వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న బావిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

Last Updated : Apr 27, 2020, 11:10 PM IST
వేగంగా బావిలోకే దూసుకెళ్లిన కారు

వలిగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వేములకొండ క్రాస్ రోడ్ వద్ద సోమవారం వేగంగా వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న బావిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు అందించిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న వలిగొండ పోలీసులు.. హుటాహుటిన సహాయ చర్యలు చేపట్టారు. అయితే అప్పటికే కారులో ప్రయాణిస్తున్న ఇద్దరిలో ఒకరు చనిపోగా మరొకరిని పోలీసులు రక్షించి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

Also read : Telangana COVID-19 updates: తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు

ఈ ప్రమాదంలో చనిపోయిన వ్యక్తిని చౌటుప్పల్‌ మండలం అల్లందేవి చెరువు గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై స్పందించిన వలిగొండ పోలీసులు.. లాక్‌డౌన్ కారణంగా రోడ్లు ఖాళీగా ఉండడంతో కొందరు అతివేగంతో వాహనాలు నడిపి ఇలా రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారని అన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రమాదం జరిగిన తీరుపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

 

Trending News