సీఎం ఫోటో మార్ఫింగ్ చేసిన వ్యక్తిపై కేసు..!

తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు ఆయన కుటుంబసభ్యుల ఛాయాచిత్రాలను అసభ్యకరమైన రీతిలో మార్ఫింగ్ చేసిన ఓ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Last Updated : Apr 10, 2018, 06:56 PM IST
సీఎం ఫోటో మార్ఫింగ్ చేసిన వ్యక్తిపై కేసు..!

తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు ఆయన కుటుంబసభ్యుల ఛాయాచిత్రాలను అసభ్యకరమైన రీతిలో మార్ఫింగ్ చేసిన ఓ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ ప్రాంతం బయ్యారం మండలానికి చెందిన రాధోడ్ అనే వ్యక్తి  ‘స్టూవర్టుపురం దొంగల ముఠా’ అనే పేరుతో రాసిన ఓ పోస్టును ఫేస్‌బుక్‌లో పెట్టాడు. ఆ పోస్టు క్రింద మార్ఫింగ్ చేసిన సీఎం కేసీఆర్ కుటుంబం ఫోటోను కూడా పెట్టాడు.

ఈ క్రమంలో ఆ పోస్టును చూసిన టీఆర్‌‌ఎస్ కార్యకర్త జరుపుల శ్రీను స్థానిక పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు సైబర్ క్రైం క్రింద కేసు నమోదు చేసిన పోలీసులు ఐపీసీ 153 ఏ సెక్షన్ క్రింద విచారణ చేపట్టి, రాధోడ్‌ పై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన పోస్టులు చేసేవారికి సైబర్ క్రైం విభాగానికి కేసులు నమోదు చేసే హక్కు ఉంటుదని చెప్పారు

Trending News