Sunitha Laxma Reddy: ఉత్కంఠకు తెర.. నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డి

BRS Narsapur Mla Candidate: మరో సిట్టింగ్ ఎమ్మెల్యే మారారు. నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డి ఎంపికయ్యారు. ప్రస్తుత ఎమ్మెల్యే మదన్ రెడ్డి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మెదక్ ఎంపీగా పోటీ చేయనున్నారు. ఆయన స్థానంలో సునీతా లక్ష్మారెడ్డికి టికెట్ దక్కింది.   

Written by - Ashok Krindinti | Last Updated : Oct 25, 2023, 05:05 PM IST
Sunitha Laxma Reddy: ఉత్కంఠకు తెర.. నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డి

BRS Narsapur Mla Candidate: నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి స్థానంలో సునీతా లక్ష్మారెడ్డిని ఎంపిక చేశారు సీఎం కేసీఆర్. ఈ మేరకు బుధవారం ప్రస్తుత నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డితో కలిసి ఆమెకు బీఫామ్ అందజేశారు. నర్సాపూర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న మదన్ రెడ్డిని రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా టికెట్ ఇవ్వనున్నారు. పార్టీలో సీట్ల అంతర్గత సర్దుబాటు చేస్తూ.. గులాబీ బాస్ కేసీఆర్ ఆధ్వర్యంలో భేటీ అయిన బీఆర్ఎస్ పార్టీ కోర్ కమిటీ సభ్యులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఏకగ్రీవంగా బీఆర్ఎస్ పార్టీ కీలక సభ్యులు తీసుకున్న నిర్ణయం పట్ల  సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
 
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. మదన్ రెడ్డి తనతో పార్టీలో మొదటినుంచి కొనసాగుతున్న సీనియర్ నాయకుడు అని చెప్పారు. 35 ఏళ్ల నుంచి తనతో సన్నిహితంగా కొనసాగుతున్న నేతగా తనకు అత్యంత ఆప్తుడు అని అన్నారు. మదన్ రెడ్డి తనకు కుడి భుజం లాంటి వాడని.. సోదర సమానుడంటూ చెప్పుకొచ్చారు. పార్టీ  ఆలోచనలను గౌరవించి నర్సాపూర్ ఎన్నికలను తన భుజ స్కందాలమీద వేసుకుని సునీతా లక్ష్మారెడ్డిని  ఎమ్మెల్యేగా గెలిపించే బాధ్యత తీసుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ప్రస్థుతం కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీగా కొనసాగుతున్న పార్లమెంటరీ స్థానం నుంచి మదన్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించిందని తెలిపారు. 

ఈ మేరకు పార్టీ కీలక సభ్యులకు, కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. "మెదక్ జిల్లాలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా కేవలం నర్సాపూర్‌లోనే కాకుండా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వారు పాపులర్ లీడర్. వివాద రహితుడు సౌమ్యుడు  మదన్ రెడ్డి గారి సేవలను పార్టీ మరింత గొప్పగా వినియోగించుకోవాల్సి ఉంది. నాతో పాటు కలిసి సునీతకు నర్సాపూర్ నియోజకవర్గ బీఫామ్ ఇవ్వడం నాకు సంతోషాన్ని కలిగించింది. చిన్న చిన్న సర్దుబాట్లు చేసుకుంటూ కీలక సమయంలో ఐక్యంగా ముందుకు పోవడం ద్వారా మదన్ రెడ్డి గారు పార్టీ ప్రతిష్టను మరింత ఇనుమడింప చేశారు. వారికి నా ధన్యవాదాలు అభినందనలు" అని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్‌ రావు పాల్గొన్నారు.

వాకిటి సునీతా లక్ష్మారెడ్డి గతంలో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ లీడర్‌గా పనిచేశారు. ఆమె మూడుసార్లు నర్సాపూర్‌ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. YSR, కొణిజెట్టి రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిల హయంలో మంత్రిగా ఉన్నారు. 2019లో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌గా, సభ్యురాలిగా పనిచేసిన విషయం తెలిసిందే. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా బరిలో నిలవనున్నారు.

Also Read: Bhagavanth Kesari: కాజల్ కి ఆ పాత్ర వేస్ట్ అని ముందే చెప్పాను అంటున్న అనిల్ రావిపూడి

Also Read: Komatireddy Rajagopal Reddy: బీజేపీకి బిగ్‌ షాక్‌..కాంగ్రెస్‌లోకి కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News