CM KCR: నీళ్ల కోసం ఏడ్చినం.. 58 ఏండ్ల దుర్మార్గాలకు కారణం కాంగ్రెస్: సీఎం కేసీఆర్ ఫైర్

BRS Praja Ashirvada Sabha: 58 ఏళ్ల దుర్మార్గాలకు కాంగ్రెస్ పార్టీనే కారణమని సీఎం కేసీఆర్ విమర్శించారు. ఎన్నికల సమయంలో రాయి ఏంటో.. రత్నం ఏంటో ప్రజలు గుర్తు పెట్టుకోవాలని కోరారు. మరోసారి బీఆర్ఎస్‌ను అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. పెద్దపల్లిలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Nov 7, 2023, 08:48 PM IST
CM KCR: నీళ్ల కోసం ఏడ్చినం.. 58 ఏండ్ల దుర్మార్గాలకు కారణం కాంగ్రెస్: సీఎం కేసీఆర్ ఫైర్

BRS Praja Ashirvada Sabha: ప్రజాస్వామ్య పరిణతి సాధించిన దేశాలు ముందుకు దూసుకుపోతున్నాయని.. మన దేశంలో రావల్సినంత పరిణతి ఇంకా రాలేదని సీఎం కేసీఆర్ అన్నారు. వజ్రాయుధం లాంటి ఓటును ఎన్నికలప్పుడూ మనం ఆగమాగం కాకుండా మంచి చేసినవాళ్లకే వేయాలని కోరారు. పెద్దపల్లిలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పుట్టిందే ప్రజల కోసం.. తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసమేనని అన్నారు. గతంలో పాలించిన కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ సాధించి పదేండ్లలో ఎంతో అభివృధ్దిని సాధించిన బీఆర్ఎస్ పార్టీలను బేరీజు వేసుకోవాలని సూచించారు. రైతులు, పేదలు, ఇతర వర్గాల గురించి పార్టీలు ఏమాలొచిస్తయో చూడాలన్నారు. తెలంగాణ ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా ఆంధ్రలో కలపింది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు.

సీఎం కేసీఆర్ స్పీచ్ హైలెట్స్

==> కరెంటు రాక షాక్ లు కొట్టి, పాములు కరిచి రైతులెందరో చనిపోయారు.. నీళ్ల కోసం ఏడ్చినం.
==> ఒక్కొక్కరోజు ఏడుగురు మంది చేనేత కార్మికులు చనిపోయేది. భూదాన్ పోచంపల్లి, దుబ్బాక, సిరిసిల్లలో మేం వెళ్లి చనిపోవద్దంటూ ఏడ్చేవాళ్లం.
==> ఒక రెండేండ్లు చనిపోకుండ్రి.. నేను కాపాడుకుంట.. కండ్లల్ల పెట్టి చూసుకుంటా అని నాడు సిరిసిల్లలో చేనేత కార్మికులకు కండ్లల్ల నీళ్లు పెట్టుకొని చెప్పిన.
==> 58 ఏండ్ల దుర్మార్గాలకు కారణం కాంగ్రెస్ పార్టీయే.
==> రాజకీయాలు, ఓట్లు చాలా ముఖ్యమైనవి. రాయి ఏంటో, రత్నం ఏంటో మనం గుర్తుపట్టాలి.
==> మనోహర్ రెడ్డి నన్ను ఎప్పుడు కలిసినా వ్యక్తిగత పనులపై గాకుండా ప్రజా పనుల గురించే  అడిగేవారు.
==> గతంలో మనోహర్ రెడ్డి స్వంత డబ్బులను ఖర్చు పెట్టి హరితహారంలో చెట్లను పెట్టిండు.
==> నాడు ఆయకట్టు ప్రాంతమైన ఇక్కడ కూడా నీళ్లు సరిగ్గా రాకపోయేది.
==> తెలంగాణ వచ్చాక మొదట వ్యవసాయం స్థిరీకరణ జరగాలె.. గ్రామాలు చల్లగుండాలెనని నిర్ణయం తీసుకున్నం.
==> రైతును నిలబెట్టేందుకు నీటి తీరువా బకాయిలను మాఫీ చేసినం. 24 గంటల ఉచిత విద్యుత్ ను ఇస్తున్నాం.  
==> పంట పెరగాలె, రాష్ట్రం గౌరవం పెరగాలెనని రైతుల జేబులు నిండాలెనని, వాళ్ల అప్పులు తీరాలెనని రైతు బంధును ప్రవేశపెట్టినం. ధాన్యం కొంటున్నాం. మేనిఫెస్టోలో చెప్పకున్నా చేసినం.
==> హైదరాబాద్ లో మన బీఆర్ఎస్ ప్రభుత్వం డబ్బులు వేస్తే.. రాష్ట్రంలోని రైతులందరి అకౌంట్లలో టింగ్.. టింగ్ మని డబ్బులు పడుతున్నయ్.
==> రైతు బంధు డబ్బులను మందు బస్తాలు, ట్రాక్టర్ కిరాయిలు, పురుగుల మందులు, ఎరువులు, విత్తనాలకో రైతులు మంచిగా వాడుకుంటున్నరు.
==> త్వరలోనే పూర్తయ్యే ప్రాజెక్టులతో నాలుగు కోట్ల టన్నుల ధాన్యాన్ని పండించి దేశంలోనే నంబర్ వన్ గా తెలంగాణ కాబోతున్నది.
==> రైతులే కథానాయకులుగా ఈ తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో వ్యవసాయం రంగ అభివృద్ధి అగ్రస్థానంలో ఉంది.
==> రైతుబంధు వచ్చే మార్చి తర్వాత 12 వేలుగా, దశలవారీగా పెంచుతూ 16 వేలు ఇవ్వబోతున్నాం.
==> ప్రస్తుత పిసిసి అధ్యక్షుడు 3 గంటల కరెంటు ఇస్తే చాలంటున్నడు.
==> రాహూల్ గాంధీ ఎవుసం ఎక్కడుందో నాకు తెలియదు కానీ.. ధరణిని తీసేసి బంగాళాఖాతంలో వేస్తమంటున్నరు.
==> ధరణి తీసేస్తే.. రైతుబంధు, రైతుబీమా, పంట కొనుగోలు డబ్బులు ఎలా వస్తయ్..?
==> కాంగ్రెస్ పార్టీ గొడ్డలి భుజం మీద పెట్టుకొని రెడీగా ఉంటూ అధికారంలోకి రాగానే ధరణిని తీసేసి మళ్లీ దళారులు, పైరవీకారుల రాజ్యం రావాలని చూస్తున్నది.
==> గతంలో పట్టా కావాలంటే ఎన్నో ఏండ్లు పట్టేది.. ఇవ్వాల మండల కేంద్రాల్లో నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్లు జరిగిపోతున్నయ్.
==> ప్రజల డబ్బు ప్రజల కోసం న్యాయంగా వాడితే ఎంతో అభివృద్ధి జరుగుతావున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి మీ కండ్ల ముందటే ఉన్నది.
==> జరిగింది ఏంటి? జరగబోయేది ఏంటి? ఏ ప్రభుత్వం వస్తే తెలంగాణకు లాభం? తెలంగాణకు ఏది క్షేమం? తెలంగాణకు ఎవరు శ్రీరామరక్ష.. అని అందర్నీ ఆలోచించమంటున్నాను.
==> కుల, మతాలకు అతీతంగా అందరికీ అన్నీ చేసుకుంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకెళ్తున్నది.
==> వెనుకబడ్డ, వివక్షకు గురైన దళిత జాతి మనలాగే మనుషులు కాదా?
==> 75 ఏండ్ల క్రితమే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేస్తే వాళ్ల జీవితాలు బాగుపడేవి కావా?
==> దళితులను బాగుపర్చాలని, కొత్త చరిత్ర సృష్టించాలని, దేశానికే మార్గదర్శకం కావాలని దళిత బంధు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందే బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ.
==> బీసీ వృత్తిపనుల వారికి లక్ష రూపాయల ఆర్థిక సాయన్ని ఇచ్చేందుకు శ్రీకారం చుట్టాం.
==> చరిత్రలో ఎవ్వరూ ఆలోచన చేయనివిధంగా నాయీ బ్రాహ్మణులు, రజకులకు మద్ధతు చేసి 250 యూనిట్ల ఉచిత కరెంటు లాంటి పనులెన్నో చేస్తున్నాం.
==> ఇప్పటివరకూ రాజకీయమంటే తమాషాలు చేయడం తప్ప మన మాదిరిగా సమాజాన్ని లోతుగా అధ్యయనం చేసి ప్రజా ఉపయోగకర కార్యక్రమాలను ఎవరూ చేయలేదు.
==> బీఆర్ఎస్ పార్టీని బలపరిచి, కారు గుర్తుకు ఓటేయాలని కోరుతున్నాను.. అని సీఎం కేసీఆర్ ప్రసంగం ముగించారు. 

Also Read: ఆ టైంలో జరుగుంటే నా పరిస్థితి ఏమిటి.. డీప్ ఫేక్ వీడియో పైన స్పందించిన రష్మిక…

Also Read: Redmi 13C Price: అదిరిపోయే ఫీచర్స్‌తో డెడ్‌ చీప్‌ ధరతో మార్కెట్‌లోకి Redmi 13C మొబైల్‌..స్పెసిఫికేషన్స్‌ ఇవే..  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

FacebookTwitterసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News