CM KCR Press meet: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బేరసారాల దృశ్యాలు.. బిగ్ స్క్రీన్‌పై బీజేపికి సినిమా చూపించిన కేసీఆర్

CM KCR Press meet: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపి కొనుగోలు చేయడానికి యత్నించిందని మొదటి నుంచి చెబుతూ వస్తోన్న సీఎం కేసీఆర్.. తాజాగా అందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను బయటపెడుతున్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

Written by - Pavan | Last Updated : Nov 4, 2022, 06:43 AM IST
  • టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందురు బీజేపి యత్నించిందన్న కేసీఆర్
  • వాళ్లకు అంత డబ్బు, ధైర్యం ఎలా వచ్చాయని ప్రశ్నించిన కేసీఆర్
  • బీజేపిపై కేసీఆర్ సంచలన ఆరోపణలు
CM KCR Press meet: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బేరసారాల దృశ్యాలు.. బిగ్ స్క్రీన్‌పై బీజేపికి సినిమా చూపించిన కేసీఆర్

CM KCR Press meet: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు, బేరసారాల కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపి ప్రయత్నిస్తోంది అంటూ ఇప్పటివరకు ఆరోపణలు మాత్రమే చేస్తూ ఆడియో టేప్స్ రిలీజ్ చేసిన సీఎం కేసీఆర్.. తాజాగా జరిగిన ప్రెస్ మీట్‌లో ఏకంగా వీడియోలను బయటపెట్టారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా దేశాన్ని నడిపించాల్సిన అగ్రనేతలే ఇలా బాధ్యారాహిత్యంగా వ్యవహరిస్తోంటే ఆయన నాయకత్వంలో పనిచేసే కిందున్న నేతలు ఇంకెలా వ్యవహరిస్తారని కేసీఆర్ ప్రశ్నించారు. ఆవు చేనుల మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా అన్న చందంగా ఈయన కిందున్న నేతలు కూడా అలాంటి మనస్తత్వమే కలిగి ఉంటారని ఎద్దేవా చేశారు. 

ఈ రోజు ప్రెస్ మీట్‌లో వినాల్సిన దానికంటే చూసేదే ఎక్కువగా ఉందని వ్యాఖ్యానించిన కేసీఆర్.. ప్రెస్ మీట్‌లో వేదికకు కుడివైపున ఏర్పాటు చేసిన బిగ్ స్క్రీన్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌజ్ లో సీక్రెట్ కెమెరాలు రికార్డు చేసిన దృశ్యాలను ప్రసారం చేసి మీడియాకు చూపించారు. ఈ దృశ్యాల్లో టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్థన్ రెడ్డి, రేగ కాంతారావులతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న రామచంద్ర భారతి, సింహయాజులు, నందులు కూర్చుని మాట్లాడుతుండటం గమనించవచ్చు.

ఇలాంటివి ఇంకొన్ని ఎపిసోడ్స్ ఉన్నాయని చెప్పిన సీఎం కేసీఆర్.. ఇలా ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల వ్యవహరం వెనుక బీజేపి సంతోష్, జేపీ నడ్డా, అమిత్ షా వంటి అగ్ర నేతలు ఉన్నట్టు తెలిపారు. అంత ధైర్యంగా వాళ్లు పేర్లు చెబుతున్నారంటే.. వాళ్లకు ఆ ధైర్యం ఎవరిచ్చి పంపించారని ప్రశ్నించారు. ఇలా అయితే దేశంలో ప్రజాస్వామ్యం ఇంకెక్కడ మిగిలి ఉందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆవేదన వ్యక్తంచేశారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News