Telangna Politics: రేవంత్ రెడ్డి Vs కేసీఆర్.. బూతులతో రెచ్చిపోయిన ఇద్దరు నేతలు

Revanth Reddy Vs KCR: మాజీ సీఎం కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. కరీంనగర్‌లో కేసీఆర్ బూతులతో రెచిపోతే.. తుక్కుగూడలో రేవంత్ రెడ్డి అంతకుమించి అనేస్థాయిలో వార్నింగ్ ఇచ్చారు. ఇద్దరు నేతలు ఏం మాట్లాడరంటే..?  

Written by - Ashok Krindinti | Last Updated : Apr 7, 2024, 11:12 AM IST
Telangna Politics: రేవంత్ రెడ్డి Vs కేసీఆర్.. బూతులతో రెచ్చిపోయిన ఇద్దరు నేతలు

Revanth Reddy Vs KCR: లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయాలు మరింత రంజుగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు మించి నాయకులు పోటీపడి విమర్శలు గుప్పించుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. పార్లమెంట్ ఎన్నికల్లోనూ అత్యధిక సీట్లు గెలుచుకోవాలని లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. అనూహ్యంగా అధికారం కోల్పోయిన బీఆర్ఎస్.. లోక్‌సభ ఎన్నికల్లో ఎలాగైనా పుంజుకోవాలని చూస్తోంది. పార్టీ నుంచి ఎమ్మెల్యేలు, కీలక నేతలు ఒక్కొక్కరు వెళ్లిపోతున్నా.. కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగి గ్రౌండ్ లెవల్‌లో పర్యటిస్తున్నారు. ప్రభుత్వ పనితీరుపై తన విమర్శలకు పదును పెట్టిన కేసీఆర్.. సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటుగానే తిట్లదండకం అందుకున్నారు. అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్‌కు తనదైన శైలిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇద్దరు నేతలు మాత్రం తమ నోటికి పని చెప్పి.. బూతులతో రెచ్చిపోయారు.

Also Read: Telangna Congress: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. దానం, కడియంలకు కాంగ్రెస్ బిగ్ షాక్..

కరీంనగర్ జిల్లాలో పర్యటన సందర్భంగా రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు మాజీ సీఎం కేసీఆర్. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. భాష కూడా బౌండరీ దాటేసింది. బీజేపీకి తెలంగాణలో ముడ్డి మొఖం లేదని.. మీ ముండ మొఖాలు అంటూ తిట్టేశారు. "పక్కా చవటలు, దద్దమ్మలు, కుక్కల కొడుకుల్లారా, ఫుట్‌బాల్ ఆడుతాం, దొంగ నా కొడుకుల్లారా.. పండబెట్టి తొక్కుకుంట పోతా.., నా వెంట్రుక కూడా తెలవదు.." అంటూ బూతు పురాణం అందుకున్నారు. 

ఇక తుక్కుగూడలో జరిగిన జన జాతర సభలో కేసీఆర్ భాషపై సీఎం రేవంత్ రెడ్డి కూడా గట్టిగానే రెచ్చిపోయారు. కేసీఆర్ నోటికొచ్చినట్లు మాట్లాడితే.. చర్లపల్లి జైలుకు పంపించి చిప్పకూడు తినిపిస్తామని హెచ్చరించారు. కేసీఆర్‌ను నక్కతో పోల్చారు. అడవి పందుల్లో రాష్ట్రాన్ని దోచుకుని తిని సర్వనాశనం చేశారని ఫైర్ అయ్యారు. పదేళ్లలో వందేళ్ల విధ్వంసం సృష్టించారని అన్నారు. మమ్మల్ని వెంట్రుక కూడా పీకలేరని అంటున్నారు. మా కాంగ్రెస్ కార్యకర్తలు పీకడం మొదలుపెడితే.. మీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు. నేను చూస్తు ఉండను. అంగీ లాగూ ఊడదీసి చర్లపల్లి జైలులో చిప్పకూడు తినిపిస్తా బిడ్డా.. చర్లపల్లిలో నీకు డబుల్ బెడ్‌ రూమ్ ఇళ్లు కట్టిస్తా.." అంటూ రేవంత్ రెడ్డి రెచ్చిపోయారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 14 ఎంపీ సీట్లు ఇవ్వాలని కోరారు. 100 రోజుల పరిపాలన ప్రజల ముందు ఉంచామని.. ఆరు గ్యారంటీల అమలుకు చిత్తశుద్ధితో పనిచేస్తుంటే తమకు ఓటు వేయాలన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేసుకుందామని పిలుపునిచ్చారు.

Also Read:  Ugadi Festival History 2024: ఉగాది పండగ ఎప్పుడు, ఎలా పుట్టింది?.. ముందు ఎవరు జరుపుకున్నారు?  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News