మొరాయించిన ఈవీఎంలు.. ఓటేసిన సైది రెడ్డి

హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో మొరాయించిన ఈవీఎంలు.. మఠంపల్లి మండలం గుండ్లపల్లిలో తన ఓటు హక్కు వినియోగించుకున్న సైది రెడ్డి

Last Updated : Oct 21, 2019, 11:37 AM IST
మొరాయించిన ఈవీఎంలు.. ఓటేసిన సైది రెడ్డి

హుజూర్‌నగర్ శాసన సభ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. అయితే, ఒకటి, రెండు చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో అక్కడ పోలింగ్ కుంటుపడినట్టు తెలుస్తోంది. నేరేడుచర్ల మండలంలోని చింతబండలో రెండు ఈవీఎంలు మొరాయించాయి. దీంతో పోలింగ్‌ను నిలిపివేసిన అధికారులు ఈవీఎంలను సరిచేస్తున్నారు. అలాగే చింతకుంట్లలోని పోలింగ్ కేంద్రంలోనూ వెలుతురు సరిగ్గా లేని కారణంగా పార్టీల గుర్తులను గుర్తించడం ఇబ్బందికరంగా ఉందని ఓటర్లు చెబుతున్నారు.

ఇదిలావుంటే, మరోవైపు హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికకు అధికార పార్టీ టీఆర్ఎస్ తరపున బరిలో నిలిచిన శానంపూడి సైది రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. మఠంపల్లి మండలం గుండ్లపల్లిలో సైది రెడ్డి తన ఓటు వేశారు.

Trending News