TS Inter Exams-2022: తెలంగాణలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల దరఖాస్తు గడువు పెంపు..!

TS Inter Exams-2022: తెలంగాణలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు గడువును పెంచారు. విద్యార్థుల విన్నపం మేరకు ఈనిర్ణయం తీసుకున్నట్లు ఇంటర్ అధికారులు వెల్లడించారు.

Written by - Alla Swamy | Last Updated : Jul 7, 2022, 11:55 AM IST
  • తెలంగాణలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
  • దరఖాస్తు గడువు పెంపు
  • ఆగస్టులో పరీక్షలు
TS Inter Exams-2022: తెలంగాణలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల దరఖాస్తు గడువు పెంపు..!

Telangana Inter Supplementary Exams-2022: తెలంగాణలో ఇటీవల ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. గతకొన్ని రోజులుగా ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఐతే నిన్నటితో దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. ఐతే విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కోరిక మేరకు మరో రెండు రోజుల వరకు గడువును పొడిగించారు. ఈమేరకు ఇంటర్ బోర్డు అధికారికంగా ప్రకటించారు. 

ఈనెల 8 వరకు ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫీజులు చెల్లించుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు. ఈపరీక్షలు ఆగస్టు 1 నుంచి 10 వరకు జరగనున్నాయి. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగున్నాయి. మధ్యాహన్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు జరుగుతాయి. 

మరోవైపు ప్రాక్టికల్స్‌లో ఫెయిలైన విద్యార్థులకు జులై 26 నుంచి 30 వరకు ప్రాక్టికల్స్‌ నిర్వహించనున్నారు. త్వరలో పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను విడుదల చేయనున్నారు. ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలు ఆగస్టు నెలాఖరు నాటికి విడుదల కానున్నాయి. 

Also read:Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్‌..ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్ల విడుదల..!

Also read:YSRCP Plenary-2022: ఏపీలో వైఎస్‌ఆర్‌సీపీ ప్లీనరీకి వేళాయే..రెండురోజుల సమావేశాల్లో ఎజెండా ఇదే..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News