ఇవాంకా ట్రంప్ తో.. కేటీఆర్ !

జీఈఎస్ సదస్సులో భాగంగా రెండవ రోజైన బుధవారం  'మనం ఇది చేయగలం! ఉద్యోగుల అభివృద్ధి మరియు స్కిల్స్ శిక్షణలో ఆవిష్కరణలు' అనే అంశంపై  చర్చాగోష్ఠి జరుగనున్నది. 

Last Updated : Nov 29, 2017, 11:10 AM IST
ఇవాంకా ట్రంప్ తో.. కేటీఆర్ !

హైదరాబాద్: జీఈఎస్ సదస్సులో భాగంగా రెండవ రోజైన బుధవారం పలు కీలక అంశాలపై  చర్చాగోష్ఠి కార్యక్రమాలు జరగనున్నాయి. 'మనం ఇది చేయగలం! ఉద్యోగుల అభివృద్ధి మరియు స్కిల్స్ శిక్షణలో ఆవిష్కరణలు' అనే అంశంపై నేడు ప్లీనరీలో ఉదయం 9:00 గంటల నుండి 10:15 వరకు జరిగే చర్చాగోష్ఠి జరిగింది. ఇందులో తెలంగాణ ఐటీ మంత్రి కె. తారకరామారావు సమన్వయకర్త (మోడరేటర్) గా వ్యవహరించారు. ప్యానెల్  సభ్యులుగా ఇవాంకా ట్రంప్ తో పాటు చెర్రీ బ్లెయిర్ (బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ భార్య), కారెన్ క్యూన్టోస్ (డెల్ కంపెనీ చీఫ్ కస్టమర్ ఆఫీసర్) మరియు ఐసీఐసీఐ ఎండీ చందా కొచ్చర్ పాల్గొన్నారు.

ఈ చర్చాగోష్టి కార్యాక్రమం ఎజెండా:  ఆర్థిక వృద్ధి వేగవంతం చేయడానికి శ్రామికశక్తిలో మహిళల భాగస్వామ్యం పెంచడం ఒక ముఖ్యమైన మొదటి దశ. నైపుణ్యాల శిక్షణ, విద్య, మరియు కెరీర్ కౌన్సెలింగ్కు పెరిగిన ప్రాముఖ్యత మహిళల జీవితాలను, వారు ప్రాతినిధ్యం వహించే కమ్యూనిటీలు మరియు వారి దేశాల ఆర్థిక సామర్థ్యాన్ని మెరుగుపర్చడానికి శక్తివంతమైన మార్గంగా చెప్పవచ్చు. శ్రామిక అభివృద్ధి మరియు శిక్షణలో ఇన్నోవేటర్స్, కార్యాలయంలో మహిళలకు తలుపులు తెరిచేందుకు ఏమనుకుంటున్నారో, ఇంకా ఏమి చేయవచ్చో చర్చిస్తారు. 

 ఇవాంకా స్పీచ్ హై లెట్స్

*  సాంకేతిక రంగం అభివృద్ధితో మహిళలు, మహిళా పారిశ్రామికవేత్తలతో అపార అవకాశాలు 

* మహిళలు ఉద్యోగాలు చేస్తూ ఆర్థికంగా కుటుంబాలకు అండగా ఉన్నారు

*  నూతన అవకాశాలను అందిపుచ్చుకునేందుకు మహిళలు సిద్ధంగా ఉండాలని పిలుపు 

* ఒక్క ప్రవేట్ రంగంలోనే కాదు.. ఏ రంగంలోనైనా నూతన ఆవిష్కరణలు చేస్తే ఆదరణ ఉంటుంది 

* స్త్రీ సమస్యలను చులకనగా చూడవద్దు. సమాజంలో సగభాగమైన వారి  సమస్యలను క్లిష్ట సమస్యలుగా భావించి పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

 

 

Trending News