Kaleshwaram Project: వైట్ ఎలిఫెంట్ గా మారిన కాళేశ్వరం.. మూడేళ్లలో రూ.3,600 కోట్ల కరెంట్ బిల్లు

Kaleshwaram Project:తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కలల ప్రాజెక్టు కాళేశ్వరంపై మొదటి నుంచి ఆరోపణలు ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కరెంట్ బిల్లుకు సంబంధించి పెదద్ ఎత్తున దుమారం రేగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు విద్యుత్ బకాయిలు 3 వేల 600 కోట్ల రూపాయలుగా తేలింది.

Written by - Srisailam | Last Updated : Aug 17, 2022, 12:32 PM IST
  • ప్రభుత్వానికి భారంగా కాళేశ్వరం ప్రాజెక్ట్
  • మూడేళ్లలో రూ. 3600 కోట్ల పవర్ బిల్లు
  • సీఎం కేసీఆర్ పై విపక్షాల ఫైర్
Kaleshwaram Project: వైట్ ఎలిఫెంట్ గా మారిన కాళేశ్వరం.. మూడేళ్లలో రూ.3,600 కోట్ల కరెంట్ బిల్లు

Kaleshwaram Project:  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కలల ప్రాజెక్టు కాళేశ్వరంపై మొదటి నుంచి ఆరోపణలు ఉన్నాయి. లక్ష కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ వృధా అని విపక్షాలు చెబుతూ వస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ వైట్ ఎలిఫెంట్ లాంటిదని కొందరు ఇరిగేషన్ నిపుణులు చెప్పారు. కేసీఆర్ ఆనాలోచిత నిర్ణయం వల్ల వేల కోట్ల రూపాయలు నిరుపయోగం అయ్యాయని విమర్శలు కొన్ని వర్గాల నుంచి వచ్చాయి. ఇటీవల వచ్చిన గోదావరి వరదలకు కాళేశ్వరం పంప్ హౌజ్ లు నీటమునిగాయి. మూడు వారాల తర్వాత బాహుబలి మోటార్లు బయటపడ్డాయి. నీట మునగడంతో మోటార్లు పాడేపోయాయని.. రిపేర్ల కోసం వెయ్యి కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని చెబుతున్నారు. పంప్ హౌజ్ లు మునగడంతో కాళేశ్వరం ప్రాజెక్టుపై వస్తున్న ఆరోపణలు నిజమేనా అన్న చర్చ జనాల్లో సాగుతోంది.

తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టు కరెంట్ బిల్లుకు సంబంధించి పెదద్ ఎత్తున దుమారం రేగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు విద్యుత్ బకాయిలు 3 వేల 600 కోట్ల రూపాయలుగా తేలింది. ఈ ప్రాజెక్టు ద్వారా గత మూడేళ్లలో  సుమారు 140 టీఎంసీల నీటిని ఎత్తిపోసి తరలించగా.. ఇందుకు గాను  మొత్తం రూ. రూ. 3,600 కోట్ల కరెంట్ బిల్లు వచ్చింది. బిల్లులను ప్రభుత్వం సకాలంలో చెల్లించకపోవడంతో  విద్యుత్ బకాయిలు అలానే పేరుకుపోతున్నాయి. విద్యుత్ అధికారుల లెక్కల ప్రకారం టీఎస్‌ఎన్పీడీసీఎల్‌ కు రూ. 2,575.58 కోట్ల కరెంట్ బిల్లు బకాయి ఉండగా..  దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థకు  రూ. 538.51 కోట్ల బకాయి ఫంది. ఈ రెండు సంస్థలకు రాష్ట్ర సర్కార్  చెల్లించాల్సిన మొత్తం  బకాయిల మొత్తం రూ. 3,114.09 కోట్లు. కరెంట్ బిల్లులను వెంటనే చెల్లించాలని తాజాగా రెండు విద్యుక్ సంస్థలు ఇరిగేషన్ శాఖకు లేఖ రాశాయి.

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 2019–20లో 66 టీఎంసీల నీటిని ఎత్తియగా.. రూ. 1105.82 కోట్ల కరెంట్ బిల్లు వచ్చింది. 2020–21లో 33 టీఎంసీల నీటిని తరలించగా రూ. 984.77 కోట్ల బిల్లు వచ్చింది. ఈ ఏడాది ఇప్పటివరకు ఎత్తిపోసిన నీటితో కలుపుకుంటే గత మూడేళ్లలో మొత్తం 3,600 కోట్ల విద్యుత్‌ బిల్లు వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన  మల్లన్న సాగర్, కొండపోచమ్మసాగర్, రంగనాయక సాగర్‌ కు నీళ్లను ఎత్తిపోశారు. ఇందుకోసం గత మూడేళ్లలో   866.21 కోట్ల రూపాయల కరెంట్ బిల్లు వచ్చింది. 327 కోట్లను మాత్రమే చెల్లించింది. ఈ లెక్కన ఒక టీఎంసీ నీటి ఎత్తిపోతకు 25.7 కోట్ల రూపాయల కరెంట్ బిల్లు వచ్చిందని అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన  ఎకరం సాగు కోసం కరెంట్ బిల్లే 21 వేల 810 రూపాయలు వస్తుందని లెక్క కట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం 19 పంప్ స్టేషన్లు నిర్మించారు. మొత్తం 82 మోటార్లు బిగించారు. ఇందుకోసం 4 వేల 627 మెగావాట్ల పవర్ అవసరం అవుతుందని ప్రభుత్వం మొదట అంచనా వేసింది. యూనిట్‌కు రూ. 6.30 ల చార్జ్ పడుతుందని.. ఈ లెక్కన ఏడాదికి 8 వేల 541 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం 20 లిఫ్టులు ఉండగా.. ఇప్పటివరకు కేవలం 8 లిఫ్టులు మాత్రమే ఉపయోగించారు. దీనికే మూడేళ్లలో 3 వేల 6 వందల కోట్ల కరెంట్ బిల్లు వచ్చింది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో ఆపరేషన్ లోకి వస్తే... అన్ని మోటార్ల పని చేస్తే కరెంట్ బిల్లు ఎలా ఉంటుందో ఊహిస్తేనే కళ్లు బైర్లు కమ్మే పరిస్థితి నెలకొంది.మరోవైపు ప్రభుత్వం గత మూడేళల్లో 140 టీఎంసీల నీటిని ఎత్తిపోశామని చెబుతున్నా.. అందులో వినియోగించింది సగం కూడా లేదంటున్నారు. గత ఏడాది జూలై మొదటి వారంలో మూడు పంప్ హౌజ్ లను ఆన్ చేసి నీటిని ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఎత్తిపోశారు. అయితే తర్వాత భారీ వర్షాలు రావడంతో గోదావరికి వరద వచ్చింది. ఎల్లంపల్లి గేట్లు ఎత్తి దిగవకు వదిలేశారు. దీంతో మేడిగడ్డ నుంచి ఎత్తిపోసిన నీటిని ఎల్లంపల్లి ద్వారా మళ్లీ నదిలోకి పంపించారనే విమర్శలు వచ్చాయి. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టుతో గత మూడేళ్లలో పెద్దగా ఉపయోగం లేకపోయినా కరెంట్ బిల్లు రూపంలో ప్రభుత్వానికి 3 వేల 6 వందల కోట్ల భారం పడిందనే ఆరోపణలు వస్తున్నాయి.

Read Also: Munugode Bypoll: మునుగోడు సీఎం సభకు సీనియర్లకు అందని ఆహ్వానం! మంత్రి ఏకచక్రాధిపత్యంపై కేడర్ ఆగ్రహం..  

Read Also: MLA Warning: కాళ్లు విరగ్గొట్టండి.. నేను చూసుకుంటా! కార్యకర్తలను రెచ్చగొట్టిన ఎమ్మెల్యే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News