Karate Kalyani meets collector : రేపు మరోసారి విచారణకు కరాటే కల్యాణి

Karate Kalyani meets collector : అక్రమ దత్తత ఆరోపణలకు సంబంధించి కరాటే కల్యాణి మరోసారి రేపు ఉదయం చైల్డ్ వెల్ఫేర్‌ కమిటీ ముందు హాజరు కానుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 17, 2022, 10:27 PM IST
  • అక్రమ దత్తత ఆరోపణలపై కలెక్టర్ కార్యాలయానికి కరాటే కల్యాణి
  • మరోసారి రేపు ఉదయం చైల్డ్ వెల్ఫేర్‌ కమిటీ ముందు హాజరు
  • రేపు కూడా పాప, చిన్నారి తల్లిదండ్రులతో వెళ్లనున్న కల్యాణి
Karate Kalyani meets collector : రేపు మరోసారి విచారణకు కరాటే కల్యాణి

Karate Kalyani meets collector : అక్రమ దత్తత ఆరోపణలకు సంబంధించి కరాటే కల్యాణి మరోసారి రేపు ఉదయం చైల్డ్ వెల్ఫేర్‌ కమిటీ ముందు హాజరు కానుంది. ఇప్పటికే హైదరాబాద్‌ కలెక్టర్‌ శర్మన్‌ను కలిశారు కల్యాణి. తన పరిస్థితి మొత్తం వివరించారు. పాపను దత్తత తీసుకోలేదని కలెక్టర్‌కు వివరించినట్లు కల్యాణి తెలిపారు. కలెక్టర్ తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని స్పష్టంగా చెప్పారని కల్యాణి వివరించారు. తనకు ఎవరూ ఎలాంటి నోటీసులు పంపలేదన్నారు. కేవలం తనకు వ్యతిరేకంగా కుట్ర పన్ని కొందరు దుష్ప్రచారం చేసేందుకే.. మీడియాకు తప్పుడు సమాచారం ఇచ్చారని కల్యాణి వివరించారు. 

పాప, చిన్నారి తల్లిదండ్రులతో కలిసి కల్యాణి కలెక్టర్ ముందు హాజరయ్యారు. ఎలాంటి చట్ట వ్యతిరేక దత్తత జరగలేదని వివరించారు. అసలు దత్తత జరగనే లేదని స్పష్టం చేశారు. పాప తన వద్ద ఉన్నంత మాత్రాన దత్తత తీసుకున్నట్లు ఎలా అవుతుందని ప్రశ్నించారు. పాప, పాప తల్లిదండ్రులు, తాను అంతా ఒకే చోట ఉంటున్నామని వివరించారు కల్యాణి.

మరోవైపు కలెక్టర్‌ను కలిసిన అనంతరం చైల్డ్ లైన్ అధికారులను కలిసేందుకు వెళ్లినా.. ఆలస్యం అయినందున రేపు మరోసారి వెళ్లి తనపై జరుగుతున్న ప్రచారంపై వివరణ ఇస్తామని కల్యాణి తెలిపింది. దత్తత వ్యవహారంపై పూర్తి వివరణ ఇచ్చేందుకు బుధవారం మరోసారి అధికారుల ముందు విచారణకు హాజరుకానుంది కల్యాణి. రేపు కూడా పాప, చిన్నారి తల్లిదండ్రులు వెళ్లి అధికారులకు వివరాలు అందించనున్నారు.

Also Read - karate kalyani vs srikanth reddy: ప్రాంక్ వీడియోల గురించి ఫ్రాంక్‌గా చెప్పాలంటే..

Also Read - KARATE KALYANI PRESS MEET : 'కరాటే కల్యాణి పారిపోదు.. పరిగెత్తిస్తది'

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News