కేసీఆర్‌ను వెంటాడుతున్న కారణాలను బయటపెట్టిన కోదండరాం

                 

Last Updated : Oct 7, 2018, 04:08 PM IST
కేసీఆర్‌ను వెంటాడుతున్న కారణాలను బయటపెట్టిన కోదండరాం

హైదరాబాద్: ఎన్నికల షెడ్యూల్ విడుదలతో తెలంగాణలో  రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. అదికార ప్రతిపక్ష నేతలు ఒకరిపై మరోకరు మాట తూటాలు వదులుతున్నారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ తీరుపై తెలంగాణ జనసమతి అధ్యక్షుడు కోదండరాం తీవ్ర విమర్శలు చేశారు.  కేసీఆర్ మాట్లాడిన ప్రతీ సారీ  ‘నేను ముఖ్యమంత్రిని నన్ను అంటారా?’ అంటున్నారని..ఆయన అహంకారి అనే దానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి హుందాగా మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. కేసీఆర్ కు రెండే రెండు కారణాలు వెంటాడుతున్నాయి..  1.వచ్చే ఎన్నికల్లో ఓడిపోతే ఏమవుతుందోననే భయం.. 2. అధికారం లేకుండా బతకడమెలా అనే భావన  ఈ రెండు కారణాల వల్ల కేసీఆర్ కు మనశ్శాంతి లేకుండాపోయిందని కోదండరాం ఎద్దేవ చేశారు.

అధికార దాహం Vs ఉద్యమ ఆకాంక్షలు
 ఈ సారి జరిగే ఎన్నికలు అధికార దాహం Vs ఉద్యమ ఆకాంక్షలు గా జరగుతాయని కోదండరాం అన్నారు. అధికార దాహంతో ఉన్న ముఖ్యమంత్రికి... ఉద్యమ అకాంక్షల సాధన కోసం ఐక్యంగా ఒక ప్రయత్నం చేయాలన్న ఒక మార్గానికి మధ్య ఈ రోజు ఘర్షణ జరుగుతోందన్నారు. ఈ ఘర్షణలో అంతిమ విజయం తమదేనని కోదండరాం ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ నియంత పాలన నుంచి తెలంగాణను విముక్తి చేయాలంటే ఉమ్మడి అలయెన్స్ తప్పదని ఆయన అభిప్రాయపడ్డారు.  అయితే తమ పార్టీ తెలంగాణ జన సమతికి ఎలాంటి నష్టం జరగని రీతిలో నడుచుకుంటామన్నారు. సీట్ల సర్దుబాటుపై త్వరలోనే ఓ నిర్ణయానికి వస్తామని కోదండరాం  మరోమారు స్పష్టం చేశారు.

Trending News