శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో తృటిలో తప్పిన ప్రమాదం

శంషాబాద్ విమానాశ్రయంలో తృటిలో పెనుముప్పు తప్పింది.

Last Updated : Aug 2, 2018, 12:29 PM IST
శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో తృటిలో తప్పిన ప్రమాదం

శంషాబాద్ విమానాశ్రయంలో తృటిలో పెనుముప్పు తప్పింది. గురువారం తెల్లవారుజామున విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో విమాన ఇంజిన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన పైలట్ అప్రమత్తంగా వ్యవహరించి వెంటనే విమానాన్ని రన్‌వే పైనే నిలిపివేశాడు. కువైట్ నుంచి వచ్చిన జజీరా విమానం శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా ఈ ఘటన జరిగింది.

విమానం నిలిపిన తర్వాత హుటాహుటిన అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను అదుపు చేశారు. విమానం దిగే సమయంలో మంటలు చెలరేగడం, సకాలంలో సిబ్బంది స్పందించడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 150 మంది ప్రయాణీకులు ఉన్నారని తెలిసింది. అందరూ క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సివుంది.

Trending News