Loksabha Elections 2024: తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల సెకండ్ లిస్ట్ వచ్చేసింది.. ఈసారి ఎవరెవరికి చోటు దక్కిందంటే..!

TS Congress Second List: తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల సెకండ్ లిస్ట్ వచ్చేసింది. ఈ సారి జాబితాలో ఐదుగురికి చోటు దక్కింది. మిగిలిన ఎనిమిది స్థానాలకు త్వరలో అభ్యర్థులను ప్రకటించనున్నారు.   

Written by - Samala Srinivas | Last Updated : Mar 21, 2024, 10:22 PM IST
Loksabha Elections 2024: తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల సెకండ్ లిస్ట్ వచ్చేసింది.. ఈసారి ఎవరెవరికి చోటు దక్కిందంటే..!

Loksabha Elections 2024: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. అధిష్టానం విడుదల చేసిన రెండో జాబితాలో మెుత్తం 57 మంది పేర్లు ఉండగా.. అందులో తెలంగాణ నుంచి ఐదుగురి పేర్లు ఉన్నాయి. ఈ లిస్ట్ లో పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ, మల్కాజ్ గిరి నుంచి సునీత మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్, చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి, నాగర్ కర్నూల్ నుంచి మల్లు రవి పేర్లు ఉన్నాయి.

ఇప్పటికే తెలంగాణ నుంచి నలుగురు ఎంపీ అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ ప్రకటించిన విషయం తెలిసిందే. వారిలో మహబూబ్ నగర్- వంశీ చంద్ రెడ్డి, జహీరాబాద్-సురేశ్ షెట్కార్, మహబూబాబాద్- బలరామ్ నాయక్, నల్గొండ-రఘువీర్ రెడ్డి ఉన్నారు. ఇంకా ఎనిమిది స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి. హైదరాబాద్‌, మెదక్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఆదిలాబాద్‌, ఖమ్మం, భువనగిరి, నిజామాబాద్‌ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయడం ఆ పార్టీకి కత్తి మీద సాము అనే చెప్పాలి.  

తాజాగా ప్రకటించిన అభ్యర్థులు వీరే..
పెద్దపల్లి- గడ్డం వంశీకృష్ణ
మల్కాజ్ గిరి- సునీత మహేందర్ రెడ్డి
సికింద్రాబాద్- దానం నాగేందర్
చేవెళ్ల- రంజిత్ రెడ్డి
నాగర్ కర్నూల్-మల్లు రవి 

Also Read: Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్ధులు ఖరారైనట్టేనా, జాబితాలో ఎవరెవరు

Also Read: KT Rama Rao: కేటీఆర్‌కు మరో ప్రతిష్ఠాత్మక ఆహ్వానం.. కవిత అరెస్ట్‌తో వెళ్తారా లేదా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News