Medaram Jatara special buses: మేడారం జాతరకు అక్కడి నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు, ఇవాల్టి నుంచే ప్రారంభం

tsrtc run special buses for medaram jatara : మేడారం జాతరకు టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. హన్మకొండ నుంచి మేడారానికి స్పెషల్ బస్సులు. ఇవాల్టి నుంచే నడుస్తోన్న సర్వీసులు. జాతర సమయంలో మరో 3,845 బస్సులు నడపనున్న ఆర్టీసీ.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 11, 2022, 04:12 PM IST
  • మేడారం జాతరకు టీఎస్ ఆర్టీసీ స్పెషల్ బస్సులు
  • హన్మకొండ నుంచి మేడారానికి బస్సులు ప్రారంభం
  • ఇవాల్టి నుంచే నడుస్తోన్న సర్వీసులు
Medaram Jatara special buses: మేడారం జాతరకు అక్కడి నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు, ఇవాల్టి నుంచే ప్రారంభం

Medaram Jatara 2022 tsrtc run special buses for medaram sammakka saralamma jatara : ఆసియా ఖండంలో జరిగే అతిపెద్ద ఆదివాసి మహాసమ్మేళనంగా మేడారం జాతరకు (Medaram Jatara) పేరుంది. మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు (, sammakka saralamma jatara) ఎంతో చరిత్ర ఉంది. ప్రతి రెండేళ్లకోసారి మాఘపౌర్ణమికి ముందు నాలుగు రోజులు సాగే మేడారం జాతరకు (Medaram Jatara) భక్తులు పోటెత్తుతారు. 

తెలంగాణలోని (Telangana) ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో సాగే జాతరకు వెళ్లే భక్తులకు టీఎస్‌ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు వెళ్లేందుకు నేటి నుంచి టీఎస్‌ ఆర్టీసీ బస్సులను ప్రారంభించింది. హన్మకొండ (Hanamkonda) బస్టాండ్ నుంచి మేడారం జాతరకు స్పెషల్‌ బస్సులను ఏర్పాటు చేసింది. హన్మకొండ బస్టాండ్ నుంచి మేడారానికి పెద్దలకు రూ. 125, పిల్లలకు రూ.65 ఛార్జీలుగా టీఎస్ ఆర్టీసీ (tsrtc) నిర్ణయించింది. 

ఇక ఇవాల్టి నుంచే మేడారం (Medaram) వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ బస్సులు ఉదయం ఏడు గంటలకు హన్మకొండ నుంచి మేడారానికి బయల్దేరుతాయి. తిరిగి సాయంత్రం నాలుగు గంటలకు మేడారం నుంచి హన్మకొండకు వస్తాయి. ఇక మేడారం జాతర కోసం ఆర్టీసీ (rtc) ప్రత్యేకంగా 3,845 బస్సులను నడపనుంది. 

Also Read : Harbhajan on Kohli: సౌతాఫ్రికాతో మూడో టెస్టులో వింటేజ్ కోహ్లీని చూస్తారు: హర్భజన్

బస్సుల్లో ప్రయాణించే వారు తప్పని సరిగా కరోనా నిబంధనలు పాటించాలని టీఎస్‌ ఆర్టీసీ (tsrtc) సూచించింది. మాస్కులు ధరించాలని, చేతులను శానిటైజ్ చేసుకోవాలని ఆర్టీసీ (RTC) పేర్కొంది. ఫిబ్రవరి 16 నుంచి 19వ తేదీ వరకు మేడారం సమ్మక్క సారక్క జాతర (sammakka saralamma jatara) సాగనుంది. జాతరను (jatara) అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు మేడారం జాతరకు (Medaram Jatara) తరలి వస్తారు. 

Also Read : AP Rains Alert: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, మూడ్రోజులు ఏపీలో వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News