Minister Harish Rao: బీజేపీ, కాంగ్రెస్ నేతలు కౌరవులు.. హుస్నాబాద్‌లో మంత్రి హరీశ్ రావు

Minister Harish Rao: మహాభారతంలో కౌరవుల్లాగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు ఇక్కడ గౌరవెల్లి ప్రాజెక్టును ఆపాలని ఎంతో ప్రయత్నం చేశారు. కానీ చివరకు న్యాయం గెలిచి ధర్మం నిలబడ్డట్టు మేము రైతుల కోసం, ప్రజల కోసం చేపట్టిన గౌరవెల్లి ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేశాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 10, 2023, 12:11 AM IST
Minister Harish Rao: బీజేపీ, కాంగ్రెస్ నేతలు కౌరవులు.. హుస్నాబాద్‌లో మంత్రి హరీశ్ రావు

Minister Harish Rao: మహాభారతంలో కౌరవుల్లాగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు ఇక్కడ గౌరవెల్లి ప్రాజెక్టును ఆపాలని ఎంతో ప్రయత్నం చేశారు. కానీ చివరకు న్యాయం గెలిచి ధర్మం నిలబడ్డట్టు మేము రైతుల కోసం, ప్రజల కోసం చేపట్టిన గౌరవెల్లి ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేశాం. ఇక చేయాల్సిందల్లా ఏదో ఒక మంచి రోజు చూసుకుని సీఎం కేసీఆర్‌ను తీసుకొచ్చి స్విచ్ ఒత్తుడే.. గౌరవెల్లిలో నీళ్లు నింపుడే అని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆనాడు హుస్నాబాద్ అంటే కరువుకు నెలవు లాంటి నేల.. కానీ ఈనాడు హుస్నాబాద్ అంటే కరువుకు సెలవు అని చెబుతూ తెలంగాణ రాక ముందు హుస్నాబాద్ లో ఉన్న పరిస్థితిని, ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తరువాత జరిగిన అభివృద్ధి గురించి చెప్పుకొచ్చారు.

ఈ గౌరవెల్లి ప్రాజెక్టుతో హుస్నాబాద్ డిక్షనరీలో కరువు అనే పదం ఇక ఉండదు అని అన్నారు. ఇక వానా కాలం అయినా.. కాకపోయినా హుస్నాబాద్ చుట్టుపక్కల రైతులకు నీళ్ల విషయంలో రంది లేదు అని మంత్రి హరీశ్ రావు స్పష్టంచేశారు. వృద్ధులను కన్నకొడుకులు చూడకున్నా మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అందరికీ పెద్దకొడుకై వారి బాగోగులు చూస్తుండు అని అన్నారు. కేసీఆర్ ఆలోచనతో తెలంగాణా సంక్షేమంలో స్వర్ణయుగంలా మారింది 

హుస్నాబాద్ ను అన్ని విధాలా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లిన సతీష్ అన్నను మీరు మళ్లీ దీవించి ఆశీర్వదించాలి. త్వరలోనే గౌరవెల్లి ప్రాజెక్టును ప్రారంభించుకుని హుస్నాబాద్ లో అన్ని పండుగలను మించిన పెద్దపండుగను జరుపుకుందాం అంటూ మంత్రి హరీశ్ రావు స్థానికుల్లో జోష్ నింపారు.

Trending News