Minor girl raped in Kamareddy: మైనర్ బాలికపై కలెక్టరేట్ సెక్యురిటీ గార్డ్ అత్యాచారం

Minor Girl Raped by Security Guard : మైనర్ బాలికకు ఓ యువకుడు మాయమాటలు చెప్పి అత్యాచారం చేసిన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. మైనర్ బాలికను అత్యాచారం చేసిన వ్యక్తి కామారెడ్డి జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయంలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహించే కిరణ్‌గా గుర్తించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 18, 2022, 10:18 PM IST
Minor girl raped in Kamareddy: మైనర్ బాలికపై కలెక్టరేట్ సెక్యురిటీ గార్డ్ అత్యాచారం

Minor Girl Raped by Security Guard : మైనర్ బాలికకు ఓ యువకుడు మాయమాటలు చెప్పి అత్యాచారం చేసిన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. మైనర్ బాలికను అత్యాచారం చేసిన వ్యక్తి కామారెడ్డి జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయంలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహించే కిరణ్‌గా గుర్తించారు. మైనర్ బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కిరణ్‌పై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. కామారెడ్డి జిల్లా పోలీసులు వెల్లడించిన కథనం ప్రకారం ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

కామారెడ్డి పట్టణంలోని గోసంగి కాలనికి చెందిన సాయిలు గుమస్తా కాలనీలో హోటల్ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సాయిలుకు నలుగురు కుమార్తెలు ఉన్నారు. మొదటి కుమార్తె వివాహం చేశాడు. మిగిలిన వారిలో రెండో కుమార్తె పదో తరగతి పూర్తి చేసుకుంది. మూడో కుమార్తె 9వ తరగతి చదువుతోంది. నాలుగో కుమార్తె 6 వ తరగతి చదువుకుంటోంది. పదో తరగతి పూర్తి చేసుకున్న రెండో కూమార్తె ఈ నెల ఏడో తేదీన ఇద్దరు చెల్లెలను తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ముగ్గురు కుమార్తెలు ఇంటికి రాకపోవడంతో తండ్రి సాయిలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తండ్రి సాయిలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 

ఇదిలావుంటే అదృశ్యమైన మైనర్ల విషయానికొస్తే.. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహించే కిరణ్ అనే యువకుడు ముగ్గురు మైనర్లను బాసర తీసుకువెళ్ళాడు. అక్కడ రెండో అమ్మాయిని కిరణ్ అత్యాచారం చేశాడు. అనంతరం కామారెడ్డికి తిరిగి వచ్చాడు. రెండో కుమార్తెకు కడుపునొప్పి వస్తుందని తల్లికి చెప్పడంతో ఏం జరిగిందని తల్లి ఆరా తీసింది. దీంతో కిరణ్ అత్యాచారం చేసినట్లు చెప్పడంతో కుటుంబ సభ్యులు కిరణ్‌పై కామారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిరణ్‌ని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో కిరణ్ నిజం ఒప్పుకున్నాడు. దీంతో కిరణ్‌పై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు కామారెడ్డి పట్టణ సీఐ నరేష్ తెలిపారు.

Also Read : President Election 2022: టీఆర్ఎస్‌లో టెన్షన్, ఎమ్మెల్యేలు ముర్ముకు ఓటేశారని భయం..!

Also Read : Ujjaini Mahankali: పూజలు సరిగా చేయడం లేదు.. దొంగలు దోచినట్లు కాజేస్తున్నారు! ఉజ్జయిని మహంకాళి అమ్మ ఆగ్రహం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News