Munugode ByPoll: మునుగోడులో గెలిచేదెవరు? సాయంత్రం జరిగిన పోలింగ్ ఎవరికి అనుకూలం?

Munugode ByPoll: తెలంగాణ రాజకీయాల్లో కాక రాజేసిన మునుగోడు ఉప ఎన్నికలో రికార్డ్ స్థాయిలో పోలింగ్ జరిగింది. ఎన్నికల సంఘం వివరాల ప్రకారం 93.5 శాతం పోలింగ్ జరిగింది. 2018 ఎన్నికల్లో 91.2 శాతం పోలింగ్ జరగగా.. ఈసారి క్రాస్ అయింది. ప్రధాన పార్టీలు హోరాహోరీగా తీసుకుని శ్రమించడంతో ఓటింగ్ భారీగా నమోదైంది.

Written by - Srisailam | Last Updated : Nov 4, 2022, 11:04 AM IST
  • మునుగోడు బైపోల్ లో 93.5 శాతం పోలింగ్
  • ఓట్లను లెక్కలు వేసుకుంటున్న పార్టీలు
  • ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై చర్చలు
 Munugode ByPoll: మునుగోడులో గెలిచేదెవరు?  సాయంత్రం జరిగిన పోలింగ్ ఎవరికి అనుకూలం?

Munugode ByPoll: తెలంగాణ రాజకీయాల్లో కాక రాజేసిన మునుగోడు ఉప ఎన్నికలో రికార్డ్ స్థాయిలో పోలింగ్ జరిగింది. ఎన్నికల సంఘం వివరాల ప్రకారం 93.5 శాతం పోలింగ్ జరిగింది. 2018 ఎన్నికల్లో 91.2 శాతం పోలింగ్ జరగగా.. ఈసారి క్రాస్ అయింది. ప్రధాన పార్టీలు హోరాహోరీగా తీసుకుని శ్రమించడంతో ఓటింగ్ భారీగా నమోదైంది. ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను రప్పించారు లీడర్లు. సాయంత్రం తర్వాత కూడా పోలింగ్ కేంద్రాలు ఓటర్లతో రద్దీగా కనిపించాయి. దాదాపుగా అన్ని బూతులలోనూ ఏడు గంటల వరకు పోలింగ్ జరిగింది. కొన్ని గ్రామాల్లో రాత్రి 10 గంటల వరకు పోలింగ్ జరిగింది. శుక్రవారం తెల్లవారుజాము వరకు ఈవీఎంల తరలింపు  కొనసాగింది.

రికార్డ్ స్థాయిలో పోలింగ్ నమోదు కావడంతో  పార్టీలన్నీ పోలింగ్ సరళిని అంచనా వేసుకుంటున్నాయి. మండలాలు, గ్రామాలు, బూతుల వారిగా పోలైన ఓట్లెన్ని... తమకు పడే ఓట్లెన్ని అని లెక్కలు చేసుకుంటున్నాయి. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అధికార టీఆర్ఎస్ కు లీడ్ వస్తుందని రావడంతో గులాబీ పార్టీలో జోష్ కనిపిస్తోంది. ఏడు మండలాల్లోనూ తామ లీడ్ చేస్తామని.. మెజార్టీ 30 వేలు దాటుందని కొందకు కారు పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. చౌటుప్పల్, చండూరు మున్సిపాలిటీల్లో బీజేపీకి కొంత లీడ్ వస్తుందని ముందు అనుకున్నా.. పోలింగ్ రోజున సీన్ మారిందని.. ఆ రెండు మున్సిపాలిటీల్లోనూ తామే లీడ్ చేస్తామని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. సంస్థాన్ నారాయణపురం, మునుగోడు,  గట్టుప్పల్ మండలాల్లో మంచి మెజార్టీ వస్తుందని పక్కాగా చెబుతున్నారు. చౌటుప్పల్ రూరల్, మర్రిగూడ, నాంపల్లి మండలాల్లోనూ భారీగా ఓట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

అటు కమలనాధులు కూడా గెలుపుపై ధీమాగానే  ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ అన్ని కారుకే జై కొట్టినా విజయంపై ధీమాగానే ఉన్నారు బీజేపీ నేతలు.  ఎగ్జిట్ పోల్స్ అన్ని మధ్యాహ్నం  4 గంటల వరకే చేశారని.. సాయంత్రం తర్వాత దాదాపు 30 శాతం పోలింగ్ జరిగిందంటున్నారు. సాయంత్రం జరిగిన పోలింగ్ తమకు అనుకూలంగా జరిగిందని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అన్ని తప్పు అవుతాయని.. మూడు నుంచి నాలుగు శాతం ఓట్లతో తాము గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. చౌటుప్పల్, చండూరు మున్సిపాలిటీల్లో పోలింగ్ తమకు ఏకపక్షంగా సాగిందని చెబుతున్నారు. మునుగోడు, మర్రిగూడ, నాంపల్లి మండలాల్లో లీక్ సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు కమలనాధులు. ఇక కాంగ్రెస్ నేతలు కూడా తమకు భారీగా ఓట్లు పడతాయని చెబుతున్నారు. మహిళా సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందని.. తమకు అంచనాకు మించి ఓట్లు వస్తాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. సంస్థాన్ నారాయణపురం, మర్రిగూడ, నాంపల్లి మండలాల్లో టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చామంటున్నారు హస్తం లీడర్లు. చండూరు రూరల్ లో లీడ్ సాధిస్తామని చెబుతున్నారు. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురుగా స్రవంతిపై జనాలు సానుభూతి చూపారంటున్నారు. మొత్తంగా  మునుగోడులో భారీగా జరిగిన పోలింగ్ తో ఆదివారం జరగనున్న కౌంటింగ్ లో ఏం జరగనుందనే ఆసక్తి నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమై అధికార పార్టీ జెండా ఎగురుతుందా లేద కమలనాధులు చెప్పినట్లు సాయంత్రం జరిగిన పోలింగ్ తో కమలనాధులు గట్టెక్కుతారా చూడాలి మరీ..

Read Also: CM KCR: ఏపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ స్కెచ్.. కేసీఆర్ సంచలన కామెంట్స్.. వైసీపీ గేమ్ ప్లాన్ ఏంటి..?

Read Also: Twitter Server Down: ట్విట్టర్ సర్వర్ డౌన్.. వినియోగదారులకు షాక్.. ఇలాంటి మెసేజ్ వచ్చిందా..?  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News