KA Paul Comments on CM KCR: తెలంగాణ ఎన్నికల్లో తాము పోటీలో ఉన్నామని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. బరిలో నిలుస్తామని.. తప్పకుండా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్ తన మీద దాడులు చేయించి.. తనను ఇబ్బంది పెట్టారని మండిపడ్డారు. కేసులు పెట్టి పోలీసులను పంపిన తనను.. తన పార్టీ కార్యకర్తలను కూడా ఇబ్బంది పెట్టారని అన్నారు. గద్దర్ విషయంలో ప్రభుత్వం చిత్ర హింసలు చేశారని ఆరోపించారు. కామారెడ్డిలో తాను పోటీ చేస్తా అనగానే అక్కడ రైతు కుటుంబాలను ఇబ్బంది పెట్టారని చెప్పుకొచ్చారు. ఈ రోజు 12 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేస్తున్నామని తెలిపారు.
"ప్రతి నియోజకవర్గంలో 100 కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తాం. మా దగ్గరికి వచ్చిన అభ్యర్థులు 5 కోట్లు డిమాండ్ చేశారు. నేను షర్మిలలాగా ప్యాకేజీ స్టార్ కాదు. రేవంత్ రెడ్డికి షర్మిల రెడ్డి, కోదండరాం రెడ్డి మద్దతు స్తారని ముందే చెప్పాను. నేను రేవంత్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని బండ్ల గణేష్ నాకు కాల్ చేశారు. కేంద్రంలో మోడీ శత్రువు, తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్‌లో జగన్ శత్రువు మాకు రేవంత్ రెడ్డి అనుకూలం కాబట్టి రేవంత్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని కోరారు. నాకు బెదిరింపులు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. నన్ను బెదిరించి రాజకీయం చేయాలంటే ఎవరి తరం కాదు..
కేపాల్‌ను కొనే వాడు భూమి మీద లేడు. నా చారిటీ ద్వారా వచ్చే డబ్బులు అన్ని క్లోజ్ చేసి నన్ను రోడ్డు పాలు చేశారు. ప్రజలకు సేవ చేయకుండా చేశారు. అధికార దాహంతో నన్ను ఇబ్బంది పెడుతున్నారు. నేను అందరికి సమాధానం చెప్పే రోజు దగ్గర్లోనే ఉంది. ఇప్పటివరకు ఐదు లక్షలు కోట్లు పంచాను. ప్రతి నియోజకవర్గంలో నన్ను, నా అభ్యర్థులను గెలిపించి, నన్ను ముఖ్యమంత్రి చేస్తే మీ నియోజకవర్గంలో 100 కోట్లు నుంచి 1000 కోట్లు ఇస్తాను.
షర్మిలను నమ్ముకొని మునిగి పోయామని నా దగ్గరకు వచ్చి ఏడ్చారు. షర్మిలది అసలు పార్టీనే కాదు. తెలంగాణ ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయండి.. నన్ను, నేను చేసిన సేవలు చుడండి.. ఒక్కసారి అవకాశం ఇవ్వండి.. నేను రాజకీయాల్లోకి రావడం చేసిన పెద్ద తప్పా..? కాంగ్రెస్ కంటే అంత అవినీతి పార్టీ ప్రపంచంలో లేదు. ఉన్న పార్టీలు అన్ని అవినీతితో ఉన్నాయి.. నేను ఒక్కడినే క్లీన్ చిట్ నాయకుడిని.. కాబట్టి ఒక్కసారి తెలంగాణ ప్రజలు నన్ను గెలిపించండి.. ఆవేదనతో, బాధతో నేను తెలంగాణ ప్రజలను వేడుకుంటున్నా.. ఒక్కసారి ఆలోచన చేసి ప్రజశాంతి పార్టీకు మద్దతు ఇవ్వండి." అని కేఏ పాల్ కోరారు.
Also Read: ఆ టైంలో జరుగుంటే నా పరిస్థితి ఏమిటి.. డీప్ ఫేక్ వీడియో పైన స్పందించిన రష్మిక…
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Facebook, Twitterసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి