రేవంత్ రెడ్డి కోసం రాహుల్ ప్రత్యేక హెలికాఫ్టర్ !!

                                

Last Updated : Nov 16, 2018, 06:39 PM IST
రేవంత్ రెడ్డి కోసం రాహుల్ ప్రత్యేక హెలికాఫ్టర్ !!

పదునైన మాటలను తూటాల్లా పేల్చే రేవంత్ రెడ్డి టాలెంట్ ను గుర్తించిన ఏఐసీసీ ..ఆయన్న ప్రచార అస్త్రంగా వాడుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ప్రస్తుత ఎన్నికల్లో రేవంత్ ను స్టార్ క్యాంపెనర్ గా వినిగించుకోనుంది.  ఇందుకోసం సన్నాహాలు కూడా ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్త పర్యటనకు ప్రణాళిలకు సిద్ధం చేస్తోంది. 

తెలంగాణలో నిర్వహించనున్న అన్ని బహిరంగ సభల్లోనూ రేవంత్ పాల్గొననున్నారు. అలాగే తన సొంత నియోజకవర్గం కొండంగల్ ప్రచార బాధ్యతలు చూసుకుంటూనే ఇతర సెగ్మెంట్లలో కూడా అభ్యర్ధుల గెలుపు కోసం ప్రయత్నం చేయాలని అధిష్టానం రేవంత్ ను కోరింది. దీనికి రేవంత్ వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం

సమయభావాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ప్రయాణించేందుకు ప్రత్యేక హెలికాఫ్టర్ సిద్ధం చేసినట్లు తెలిసింది. ఆయన ఇంటి ముందుకు ఇప్పటికే హెలిప్యాడ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. అయితే ఇందుకు సంబంధించిన పోలీసులు అనుమతి రాలేదని సమాచారం. అయితే అనుమతి వ్యవహారం కాంగ్రెస్ పెద్దలు  చూసుకోనున్నారు.

 

Trending News