Revanth Reddy: కేసీఆర్, కేటీఆర్ ఉద్యోగాలను ఊడగొట్టండి.. నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి పిలుపు

TS Politics: నిరుద్యోగ యువతి ఆత్మహత్య చేసుకుంటే.. ఆ కుటుంబం పరువును మంటగలిపేలా ప్రభుత్వం వ్యవహరించిందని ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. లవ్‌ ఫెయిల్యూర్ వల్లే అమ్మాయి చనిపోయిందని పోలీసు అధికారి ఎలా చెబుతారని ప్రశ్నించారు.    

Written by - Ashok Krindinti | Last Updated : Oct 17, 2023, 03:18 PM IST
Revanth Reddy: కేసీఆర్, కేటీఆర్ ఉద్యోగాలను ఊడగొట్టండి.. నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి పిలుపు

TS Politics: సీఎం కేసీఆర్, మంత్రులు హరీష్ రావు, కేటీఆర్‌లు డబ్బులు, మందు పంచి ఎన్నికల్లో గెలవాలని కాంగ్రెస్ చూస్తోందని పదేపదే ఆరోపణలు చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో డబ్బు, లిక్కర్ పంచి ఎన్నికల్లో గెలవాలని చూశారని.. బీజేపీ, బీఆర్ఎస్ పోటీ పడి ఉప ఎన్నికల్లో వందల కోట్లు ఖర్చు చేశాయన్నారు. నెల రోజుల్లో రూ.60 కోట్ల మద్యం అమ్మకాలు జరిగితే.. మునుగోడు ఉప ఎన్నిక జరిగిన 30 రోజుల్లో రూ.300 కోట్ల మద్యం అమ్మారని విమర్శించారు. మునుగోడులో కాంగ్రెస్ చుక్క మందు, డబ్బు పంచలేదని స్పష్టం చేశారు. దేశంలోనే హుజూరాబాద్ అత్యంత ఖరీదైన ఎన్నికలని ఆనాడు విశ్లేషకులు చెప్పారని గుర్తుచేశారు.

మునుగొడు ఉప ఎన్నికల్లో అంతకంటే ఎక్కువ ధన ప్రవాహం జరిగింది. అందుకే మాపై ఆరోపణలు చేస్తున్న కేసీఆర్‌కు నేను సూటిగా సవాల్ విసిరా.. చుక్క మందు, డబ్బు పంచకుండా ఎన్నికలు నిర్వహించాలని సవాల్ విసిరా.. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలతోనే ఎన్నికలకు వెళుతుంది. అమరవీరుల స్థూపం దగ్గరకు వచ్చి ప్రమాణం చేద్దామని ఆహ్వానించా.. కేసీఆర్ రాకపోగా.. అమరుల స్థూపం వద్దకు వెళితే నన్ను అరెస్టు చేస్తారా..? ముందస్తు అనుమతి పేరుతో పోలీసులు నిర్బంధించారు. మా కార్యకర్తలపై దాడులు చేశారు. తెలంగాణ ప్రజలు కోరింది స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అభివృద్ధి. నీళ్లు, నిధులు, నియామకాలను కేసీఆర్ తన కుటుంబానికే పరిమితం చేశారు. 

మేం విసిరిన సవాల్ స్వీకరించకపోవడంతో కేసీఆర్ ఎన్నికల్లో డబ్బు, మద్యాన్ని నమ్ముకున్నారని స్పష్టత వచ్చింది. నిరుద్యోగ యువతి ఆత్మహత్య చేసుకుంటే.. ఆ కుటుంబం పరువును మంటగలిపేలా ప్రభుత్వం వ్యవహరించింది. ప్రేమ విఫలమై చనిపోయిందని పోలీసు అధికారి ఎలా చెబుతారు. నిర్భయ చట్టాన్ని ఉల్లంఘించి వివరాలు ఎలా బయటపెడతారు..? కోర్టు అనుమతితో ఆధారాలు తీసుకున్నాకే వివరాలు వెల్లడించాల్సింది. కానీ అవేవీ చేయలేదు. నేను ప్రశ్నిస్తే.. ప్రెస్ మీట్ పెట్టిన అధికారిని కాకుండా వేరే అధికారిని సస్పెండ్ చేశారు. రిటైర్ అయిన అధికారులను ప్రభుత్వం ఎందుకు కొనసాగిస్తోంది. వారిని ప్రైవేట్ సైన్యంగా చేసుకుని కేసీఆర్ మాపై దాడులు చేయిస్తున్నారు. 

నిన్న గన్ పార్క్ వద్ద నిరసనలు చేసినవారికి నిబంధనలు వర్తించవా..? కాంగ్రెస్‌ను తిట్టి ధర్నా చేసే వారికి రిటర్నింగ్ అధికారి అనుమతి అవసరం లేదా..? మేం ఇచ్చిన హామీలలో అన్నింటినీ రెట్టింపు చేసి కేసీఆర్ మేనిఫెస్టోలో పెట్టారు. మరి మేం 2 లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పాం.. మరి కేసీఆర్ ఉద్యోగ నియామకాల ఊసే ఎత్తలేదు. ప్రవళ్లిక కుటుంబ సభ్యులను రేపు రాహుల్ గాంధీ వద్దకు తీసుకెళ్లాలనుకుంటే.. బీఆర్ఎస్ నేతలను పంపి ఆ కుటుంబాన్ని ప్రగతి భవన్‌లో బంధిస్తారట.. కేసీఆర్ ఇంతటి దిగజారుడు చర్యలకు పాల్పడుతున్నారు." అని రేవంత్ రెడ్డి అన్నారు.

నిరుద్యోగ యువకులారా మీ శక్తిని తక్కువ అంచనా వేయకండని.. 30 లక్షల నిరుద్యోగ యువకులారా  ఇక్కడి నుంచి పిలుపునిస్తున్నానని చెప్పారు. ఈ 45 రోజులు ప్రతీ నిరుద్యోగ యువకుడు ముందుకొచ్చి కేసీఆర్, కేటీఆర్ ఉద్యోగాలను ఊడగొట్టాలని కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే జాబ్ క్యాలండర్ ప్రకారం ఉద్యోగ నియామకాలు చేపడుతుందని హామీ ఇచ్చారు. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. ఒక ఆడబిడ్డ కుటుంబాన్ని అవమానించేలా వ్యవహరించిన ప్రభుత్వానికి బుద్ది చెప్పాలన్నారు.

Also Read: Bathukamma Festival Special: బతుకమ్మ పండుగ స్పెషల్.. ఈ పూలలో దాగిన ఔషధ గుణాలు ఎన్నో..!  

Also Read: TCS Recruitment: టీసీఎస్ కంపెనీ గుడ్‌న్యూస్.. 40 వేల మంది నియామకాలకు రెడీ..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News