Who is Telangana CM: సీఎం ఎంపికలో బిగ్ ట్విస్ట్.. పట్టువీడని భట్టి, ఉత్తమ్

Telangana New Chief Minister: తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి పేరు దాదాపు ఖరారు అయినా.. అధికారిక ప్రకటనపై అధిష్టానం ఆలస్యం చేస్తోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క రేసులో ఉండడంతో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. తమ పేర్లను కూడా పరిశీలించాలని అధిస్టానానికి విన్నవించినట్లు తెలిసింది.  

Written by - Ashok Krindinti | Last Updated : Dec 5, 2023, 06:09 PM IST
Who is Telangana CM: సీఎం ఎంపికలో బిగ్ ట్విస్ట్.. పట్టువీడని భట్టి, ఉత్తమ్

Telangana New Chief Minister: తెలంగాణ సీఎం ఎవరనే ఉత్కంఠ కొనసాగుతోంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేరును ఫైనల్ అయిందని.. డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం ఉంటుందని ప్రచారం జరిగింది. అయితే చివరి నిమిషంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క పట్టు వీడడం లేనట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో డీసీ వేణుగోపాల్‌, డీకే శివకుమార్‌తో ఈ ఇద్దరు నేతలు సమావేశమయ్యారు. నేడు సాయంత్రంలోపు తెలంగాణ సీఎం అభ్యర్థి పేరు ప్రకటిస్తారని జరుగుతున్న తరుణంలో ఇంకా చర్చలు, సమావేశాలు జరుగుతుండడంతో ఉత్కంఠ నెలకొంది. అందరూ ఊహించినట్లే రేవంత్ రెడ్డికి అవకాశం కల్పిస్తారా..? లేదంటే భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలలో ఒకరిని ఎంపిక చేస్తారా..? అనేది ఆసక్తికరంగా మారింది.

అంతకుముందు ఓ ఛానెల్‌తో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ హైకమాండ్‌ సరైన పద్ధతి పాటిస్తోందని తెలిపారు. 70 నుంచి 75 సీట్లు కాంగ్రెస్‌కు వస్తాయని ఆశించామని.. ఇవాళ ఉదయం డీకే శివకుమార్‌ను ఢిల్లీలో కలిశానని చెప్పారు. డీకే శివకుమార్‌కు తన అభిప్రాయం తెలియజేశానని.. ముఖ్యమంత్రి పదవి రేసులో తాను కూడా ఉన్నానని అన్నారు. అయితే హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. తాను పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత ఉండేది కాదన్నారు. 

మరోవైపు భట్టి విక్రమార్క ట్వీట్ వైరల్‌గా మారింది. "ప్రతి పేదవాడి గుండె తాకిన క్షణాలు.. గుండె నిండా ఆత్మ స్థైర్యం, కుంగిపోతున్న జీవితాలకు ఈ అరాచక పాలన నుండి విముక్తి ఇవ్వాలన్న లక్ష్యం, నైరాశ్యంలో ఉన్న క్షేత్ర స్థాయి కాంగ్రెస్స్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాలన్న ఆశ.. ఇవే నా పాదయాత్రకు ఆయువు పోసి నడిపించాయి. దట్టమైన గుట్టలు, పొగలు కక్కే రోడ్డులు, వేల అడ్డంకులు.. మండుటెండలు, వడగాళ్ల వానలు, ఎముకలు వణికించే చలి.. కాలేదు ఏవి మన సంకల్పానికి అడ్డు.. 1364 కిలోమీటర్లు.. 109 రోజులు.. అడుగుపెట్టిన అన్ని నియోజకవర్గాల్లో దాదాపుగా కాంగ్రెస్ విజయం.." అంటూ ఆయన ట్వీట్ చేశారు. తాను పాదయాత్ర చేసిన ప్రాంతాల్లో కాంగ్రెస్ గెలుపొందిందని.. పార్టీ విజయంలో తన పాత్ర కీలకమని చెప్పకనే చెప్పారు. 

Also Read: Abhiram Daggubati: దగ్గుబాటి అభిరామ్ పెళ్లి.. సురేష్ బాబు ఇంట మొదలైన సంబరాలు

Also Read: Vivo T2 Pro 5G Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో బొనాంజా సేల్‌..Vivo T2 Pro 5Gపై రూ.22,550 వరకు ఎక్చేంజ్‌ బోనస్‌..  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News