లైంగిక వేధింపులు: ఎస్సై శ్రీనివాస్ రెడ్డిని సస్పెండ్ చేసిన మహబూబాబాద్ ఎస్పీ

SI Srinivas Reddy sexual harassment on trainee SI: మహబూబాబాద్: దళిత మహిళా ట్రైనీ ఎస్సైపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరిపెడ ఎస్సై  శ్రీనివాస్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. తాను దళితురాలిని కాబట్టే తనపై చిన్నచూపుతో తనపట్ల అసభ్యంగా ప్రవర్తించినట్టు మహిళా ట్రైనీ ఎస్సై ఆరోపించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 4, 2021, 12:02 AM IST
లైంగిక వేధింపులు: ఎస్సై శ్రీనివాస్ రెడ్డిని సస్పెండ్ చేసిన మహబూబాబాద్ ఎస్పీ

SI Srinivas Reddy sexual harassment on trainee SI: మహబూబాబాద్: దళిత మహిళా ట్రైనీ ఎస్సైపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరిపెడ ఎస్సై  శ్రీనివాస్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. తాను దళితురాలిని కాబట్టే తనపై చిన్నచూపుతో తనపట్ల అసభ్యంగా ప్రవర్తించినట్టు మహిళా ట్రైనీ ఎస్సై ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే శ్రీనివాస్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ మహబూబాబాద్ ఎస్పీ కోటిరెడ్డి (Mahaboobabad SP Kotireddy) మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

రాత్రిపూట అడవిలోకి తీసుకెళ్లి తనపై అత్యాచారం చేసేందుకు యత్నించిన శ్రీనివాస్ రెడ్డిపై ( Maripeda SI Srinivas Reddy) కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సదరు మహిళా ట్రైనీ ఎస్సై వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషికి ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం జరగకపోతే తన ఉద్యోగానికి రాజీనామా చేయడానికైనా వెనుకాడనని ట్రైనీ మహిళా ఎస్.ఐ స్పష్టం చేసింది. అలా ఈ వివాదం మరింత పెద్దది కావడంతో.. మహిళా ట్రైనీ ఎస్సై ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరుపుతున్నట్లు వరంగల్ పోలీసు కమిషనర్ తరుణ్ జోషి ప్రకటించారు. ఎస్సై శ్రీనివాస్ రెడ్డి లైంగిక వేధింపులకు (Sexual harassments charges) పాల్పడినట్లు నిర్ధారణ అయితే.. అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వరంగల్ సీపీ తెలిపారు. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే ఎస్సై శ్రీనివాస్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ కోటి రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు.

మరియమ్మ లాకప్ డెత్ కేసులో (Mariyamma lockup death case) పోలీసులు డిస్మిస్‌కి గురైన కొద్దిరోజుల్లోనే మరోసారి పోలీసులపై ఇలా మరో ఆరోపణలు రావడం సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు సైతం తీవ్రంగా మండిపడుతున్నాయి.

Trending News