హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్

Last Updated : Nov 3, 2018, 10:15 PM IST
హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్

హైదరాబాద్ మెట్రో రైలులో ప్రయాణిస్తూ, మెట్రో స్టేషన్ల వద్ద తమ వాహనాలను పార్క్ చేసుకోవడానికి తిప్పలు పడుతున్న ప్రయాణికులకు ఓ గుడ్ న్యూస్. ఎప్పటినుంచో చెబుతూ వస్తోన్న ఇంటిగ్రేటేడ్ స్మార్ట్ పార్కింగ్ మేనేజ్ మెంట్ సిస్టం (ఐఎస్‌పీఎంఎస్) మరో వారం రోజుల్లోనే హబ్సిగూడలో అందుబాటులోకి రానుంది. అనంతరం అతి త్వరలోనే హైదరాబాద్ లోని మిగతా అన్ని మెట్రో స్టేషన్లలో ఈ తరహా స్మార్ట్ పార్కింగ్ విధానాన్ని అమలు చేయడానికి హైదరబాద్ మెట్రో రైలు లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. స్మార్ట్ పార్కింగ్ విధానం గురించి హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ.. మరో మూడు నెలల్లోనే మిగతా మెట్రో స్టేషన్లలో ఈతరహా పార్కింగ్ విధానాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. 

స్మార్ట్ పార్కింగ్ విధానం అమలుతో మొబైల్ యాప్ ద్వారా పార్కింగ్ స్థలంలో ద్విచక్ర వాహనానికైనా, కార్లకైనా పార్కింగ్ ఎక్కడ ఖాళీ స్థలం ఉందో చెక్ చేసుకుని, అక్కడే పార్క్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ద్విచక్ర వాహనాలకు మొదటి 2 గంటలకు రూ.6, ఆ తర్వాత ప్రతీ గంటకు రూ.3 చొప్పున వసూలు చేయనున్నారు. ఇక ఫోర్ వీలర్ల పార్కింగ్ విషయానికొస్తే, తొలి 2 గంటలకు రూ.16, ఆ తర్వాత ప్రతీ గంటకు రూ.8 చొప్పున వసూలు చేస్తారు. 

Trending News