రూ.1,000 కోట్ల కమీషన్ల కోసమే బీటీపీఎస్ : రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, శాసనసభ స్పీకర్ మధుసూదనా చారి వారి పదవుల్లో కొనసాగే నైతిక హక్కును కోల్పోయారన్న టీ కాంగ్రెస్ నేతలు

Last Updated : Apr 18, 2018, 10:14 AM IST
రూ.1,000 కోట్ల కమీషన్ల కోసమే బీటీపీఎస్ : రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, శాసనసభ స్పీకర్ మధుసూదనా చారి వారి పదవుల్లో కొనసాగే నైతిక హక్కును కోల్పోయారని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చేరుకున్న సందర్భంగా అక్కడ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ గెలిస్తే పోడు భూములకు పట్టాలిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. టీ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రూ.1,000 కోట్ల కమీషన్ల కోసం కక్కుర్తిపడి కాలుష్యకాసారమైన భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (బీటీపీఎస్‌) ను మణుగూరులో ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. ఇదిలావుంటే, ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ నేతలు మొదలుపెట్టిన ఈ బస్సు యాత్ర తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 

రానున్న ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్‌కి చెందిన అగ్రనాయకులు, ఎక్కడికక్కడ ఆయా జిల్లాలు, స్థానిక నేతలు ఈ బస్సు యాత్రలో పాల్గొని తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతూ తమ యాత్రను ముందుకు తీసుకెళ్తున్నారు. 

Trending News