CM KCR: గ్రామ పంచాయ‌తీల‌కు గుడ్‌న్యూస్.. పాత బ‌కాయిలు రూ.1190 కోట్లు విడుద‌ల‌

Gram Panchayats Funds: గత కొంతకాలంగా గ్రామ పంచాయతీలకు నిలిచిన నిధులను విడుదల చేసింది కేసీఆర్ సర్కారు. మొత్తం రూ.1190 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు వివరాలు వెల్లడించారు.  

Written by - Ashok Krindinti | Last Updated : May 23, 2023, 02:45 PM IST
CM KCR: గ్రామ పంచాయ‌తీల‌కు గుడ్‌న్యూస్.. పాత బ‌కాయిలు రూ.1190 కోట్లు విడుద‌ల‌

Gram Panchayats Funds: గ్రామ పంచాయ‌తీల‌కు తెలంగాణ సర్కారు గుడ్‌న్యూస్ చెప్పింది. గ్రామ పంచాయ‌తీల‌కు గ‌త కొంత కాలంగా నిలిచిపోయిన పాత బ‌కాయిలు రూ.1190 కోట్ల నిధుల‌ను విడుద‌ల చేస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రులు హ‌రీశ్‌రావు, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావులు చర్చించి నిధులు విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సోమవారం ప్రభుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతికుమారితో మంత్రి ఎర్రబెల్లి భేటీ అయి చర్చించిన విషయం తెలిసిందే. మంగళవారం ఇద్ద‌రు మంత్రులు స‌మావేశ‌మ‌య్యారు. 

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయ‌తీలలో వివిధ ప‌నుల‌కు సంబంధించి నిలిచిపోయిన‌ బ‌కాయిలపై చ‌ర్చించారు. రూ.1190 కోట్ల‌ను విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించారు. ఈ మేర‌కు సంబంధిత అధికారుల‌తో మాట్లాడి వెంట‌నే ఆ నిధుల‌ను విడుద‌ల చేయాల‌ని ఆదేశించారు. ఈ నిధుల‌ను విడుద‌ల చేయ‌డంతో రాష్ట్ర వ్యాప్తంగా స‌ర్పంచ్‌ల‌లో హ‌ర్షాతిరేకాలు వ్య‌క్తం అవుతున్నాయి. గ‌త కొంత కాలంగా బ‌కాయిలు నిలిచిపోవ‌డంతో స‌ర్పంచులు చేప‌ట్టిన ప‌నుల పురోగ‌తి మంద‌గించింది. దీంతో కొన్ని ప‌నులు మ‌ధ్య‌లోనే నిలిచిపోయాయి. కొత్త‌గా ప‌నులు చేప‌ట్ట‌డానికి స‌ర్పంచ్‌లు ఇబ్బందులు ప‌డ్డారు.

ఈ నిధులు విడుద‌ల కావ‌డంతో అభివృద్ధి ప‌నులు మ‌రింత వేగంగా జ‌ర‌గనున్నాయి. నిధులు విడుదల చేయడంతో స‌ర్పంచ్‌ల సంఘం ప్ర‌తినిధులు రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెక‌ల్లి ద‌యాక‌ర్ రావుని హైద‌రాబాద్‌లోని మంత్రుల నివాసంలో క‌లిసి సంతోషం వ్య‌క్తం చేశారు. ఈ నిధుల విడుద‌ల‌తో స‌ర్పంచ్ లలో హ‌ర్షాతిరేకాలు వ్య‌క్తం అవుతున్నాయ‌ని చెప్పారు. సీఎం కేసీఆర్ తోపాటు, మంత్రులు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, హ‌రీష్‌ రావుల‌కు వారు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. సీఎం కేసీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. మాట త‌ప్ప‌కుండా, అంద‌రి శ్రేయోభిలాషిగా ఆలోచిస్తున్నార‌ని కొనియాడారు. అందుకే ప‌ల్లెల్లో ప్ర‌గ‌తిని దృష్టిలో పెట్టుకుని, ఎన్ని ఇబ్బందులు ఉన్నా నిధులు విడుద‌ల చేస్తూ అభివృద్ధిని నిరాటంకంగా కొన‌సాగిస్తున్నార‌ని అన్నారు.

Also Read: MP YS Avinash Reddy: ఎంపీ అవినాష్‌ రెడ్డి పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు  

Also Read: GT vs CSK Dream11 Prediction Team: ప్లేఆఫ్స్ సమరం నేడే.. గుజరాత్ Vs చెన్నై.. డ్రీమ్ 11 టీమ్ ఇదే..!   

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News