Revanth Reddy Questions KCR: మళ్లీ మోసం చేయడానికి వస్తున్నారు.. కేసీఆర్ సర్కారుపై రేవంత్ రెడ్డి ఫైర్

Revanth Reddy Questions KCR and KTR: తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముచ్చటగా మూడోసారి ప్రజల్ని నట్టేట ముంచడానికి రెడీ అయ్యారు అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మళ్లీ బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి వారిని గెలిపించి,  మీరు  మోసపోవద్దు అని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 24, 2023, 04:32 AM IST
Revanth Reddy Questions KCR: మళ్లీ మోసం చేయడానికి వస్తున్నారు.. కేసీఆర్ సర్కారుపై రేవంత్ రెడ్డి ఫైర్

Revanth Reddy Questions KCR and KTR: తెలంగాణలో ప్రశ్నించే గొంతు ఉండాలి అనే ఉద్దేశంతో మీరంతా ఇక్కడి నుంచి నన్ను ఎంపీగా గెలిపించారు. అలాగే మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీరు ఎదుర్కొంటున్న అన్నిరకాల ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వచ్చా.. ఎప్పటికప్పుడు ప్రజావ్యతిరేక ప్రభుత్వ విధానాలను ప్రజా వేదికలపై ఎండగడుతూ వచ్చా అని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. పేదల కష్టాల గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఏమాత్రం ఆలోచించరు. ఎక్కడ చూసినా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవీ ఇప్పటివరకు నెరవేర్చలేదు. చివరకు పోలీసులకు, పాత్రికేయ మిత్రులకు కూడా ఇచ్చిన మాట తప్పిండు. వారికి కూడా ఎలాంటి మేలు చేయలేదు అని రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ వైఖరిపై మండిపడ్డారు.

నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తానని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ ఆ మాట కూడా తప్పారు. ఇవన్నీ చాలవన్నట్టుగా మూడోసారి కూడా తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. తండ్రిని నమ్మడం లేదని ఈసారి కొడుకును పంపిస్తుండు అని చెప్పుకొచ్చిన రేవంత్ రెడ్డి.. " బాప్ ఏక్ నంబర్ ఐతే.. బేటా దస్ నంబర్.. " అంటూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లనుx ఎద్దేవా చేశారు. కేసీఆర్ కొడుకు కేసీఆర్ లాగే జనాన్ని మోసం చేస్తాడు కానీ తప్ప ప్రజల కోసం ఆలోచించరు..

తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముచ్చటగా మూడోసారి ప్రజల్ని నట్టేట ముంచడానికి రెడీ అయ్యారు అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మళ్లీ బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి వారిని గెలిపించి,  మీరు  మోసపోవద్దు అని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని ఓటర్లను వేడుకున్న రేవంత్ రెడ్డి.. రాజకీయంగా నష్టపోయినప్పటికీ..  సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చి అరవై ఏండ్ల తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చారు అని గుర్తుచేశారు. అందుకే సోనియాగాంధీకి కృతజ్ఞత తెలిపే బాధ్యత తెలంగాణ ప్రజలపై ఉంది అని అభిప్రాయపడ్డారు.

1200 మంది అమరుల త్యాగాలను నిన్న కేసీఆర్ చులకన చేస్తూ మాట్లాడారు అని ఆవేదన వ్యక్తంచేసిన రేవంత్ రెడ్డి.. తెలంగాణ బిడ్డల ప్రాణాల విలువ నీకు తెలుసా కేసీఆర్ అని నిలదీస్తూ మండిపడ్డారు. 
చేగువేరా, నెల్సన్ మండేలా, సుభాష్ చంద్రబోస్, గాంధీ కుటుంబాలు ఆర్థికంగా ఎలా ఉన్నారో చూస్తే త్యాగాలు చేసిన వారి కుటుంబాలు ఎలా ఉంటాయో అర్థం అవుతుంది. అలాగే అడవి బిడ్డల అభ్యున్నతి కోసమే కొట్లాడి ప్రాణాలు వదిలిన కొమురం భీం మనుమడు కూడా ఇప్పటికీ పేదరికంలో ఉన్నారు. అంతేకాకుండా చాకలి ఐలమ్మ వారసులు సైతం ఏవేవో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు కానీ నీలా వేల కోట్లకు ఎదగలేదు అని గుర్తుచేశారు.

ప్రజల కోసం కొట్లాడిన కుటుంబాలు ప్రజల కోసమే ఆదర్శంగా ఉంటూ ఇప్పటికీ దీనంగానే తమ బతుకును వెళ్లదీస్తున్నారు. కానీ 2001 కి ముందు తొడుక్కోవడానికి చెప్పులు కూడా లేని కేసీఆర్ కు ఇవాళ ఇన్ని లక్షల కోట్లు ఎలా వచ్చాయి ?, ఎక్కడి నుంచి వచ్చాయి అని మండిపడ్డారు. నిజాం రాజు కూడా ఊరికే ధనవంతుడు కూడా అవలేదు. 220 ఏండ్లు నిజాం రాజ్యాన్ని ఏలిన తరువాతే నిజాం ధనవంతుడు అయ్యాడు.. కానీ కేసీఆర్ మాత్రం కేవలం పదేళ్లలోనే లక్షల కోట్లకు పడగలెత్తాడు.. ఆ డబ్బంతా ప్రాజెక్టుల్లో కమిషన్లకు కక్కుర్తిపడి సంపాదించిన అవినీతి సొమ్ము కాకపోకే ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో అవినీతికి పాల్పడి రాష్ట్రాన్ని దోచుకు తింటున్న మీరా తెలంగాణ ఉద్యమకారులు అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. 1200 మంది అమరవీరులు తెలంగాణ కోసం ప్రాణాలిస్తే...  ప్రభుత్వం గుర్తించింది కేవలం 528 మందిని మాత్రమే. మరి మిగతా వారు ఏమయ్యారు.. అలాగే రాష్ట్రం కోసం వారు చేసిన త్యాగాలు ఏమయ్యాయి అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ కోసం తమ బిడ్డలను కోల్పోయిన అమరుల కుటుంబాలకు ఈ తొమ్మిదేళ్లలో కనీసం బుక్కెడు బువ్వ పెట్టలేని సర్కారు మీ ప్రభుత్వం అని ఆగ్రహం వ్యక్తంచేశారు.

Trending News