ఎస్సై, ఏఎస్సై పోస్టుల రాతపరీక్ష ఫలితాలు విడుదల

ఎస్సై, ఏఎస్సై పోస్టుల రాతపరీక్ష ఫలితాలు విడుదల

Last Updated : Sep 26, 2018, 06:57 PM IST
ఎస్సై, ఏఎస్సై పోస్టుల రాతపరీక్ష ఫలితాలు విడుదల

కమ్యూనికేషన్ ఎస్సై (ఐటీ అండ్ కమ్యూనికేషన్ ఎస్సై), ఫింగర్‌ప్రింట్ బ్యూరో ఏఎస్సై పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రాథమిక రాతపరీక్ష ఫలితాలను తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామకమండలి (టీఎస్‌ఎల్పీఆర్బీ) విడుదల చేసింది. ఛైర్మన్ వీవీ శ్రీనివాసరావు మంగళవారం ఫలితాలను విడుదల చేశారు. ఈ నెల 9న రాష్ట్రవ్యాప్తంగా ఈ పరీక్షలు జరిగాయి.

ఎస్సై పోస్టులకు 10,809 మంది అభ్యర్థులు రాతపరీక్షకు హాజరుకాగా.. 4,684 మంది అభ్యర్థులు ప్రిలిమ్స్‌లో అర్హత సాధించారు. అలాగే ఏఎస్సై ఫింగర్‌ప్రింట్ బ్యూరో పరీక్షకు 6,013 మంది అభ్యర్థులు హాజరుకాగా.. 3,276 మంది అభ్యర్థులు అర్హత పొందారు.

వెబ్‌సైట్‌లో ఫైనల్ 'కీ' అందుబాటులో ఉంది. అర్హులైన అభ్యర్థుల జాబితాను www.tslprb.in వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్టు తెలిపారు. అర్హత సాధించిన వారు రెండో దశ ఎంపిక ప్రక్రియకు (ఫిజికల్ ఈవెంట్స్) సిద్ధంగా ఉండాలని నియామక బోర్డు తెలిపింది.

ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన వారు రెండో దశ ఎంపిక ప్రక్రియకు అవసరమైన ధ్రువపత్రాలు, సమాచారాన్ని వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయ్యి, అందజేయాలని అధికారులు సూచించారు. దేహదారుఢ్య పరీక్ష తేదీ, వేదిక  తదితర వివరాలను త్వరలో వెల్లడిస్తామన్నారు.

పుకార్లు నమ్మొద్దు..

తెలంగాణ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు జరుపుతున్న నియామక ప్రక్రియకు ఎన్నికలతో సంబంధం లేదని పోలీస్‌ డిపార్ట్మెంట్ స్పష్టం చేసింది. నియామక  ప్రక్రియకు ఎన్నికలు ఆటంకమవుతాయంటూ వస్తున్న పుకార్లను అభ్యర్థులు నమ్మవద్దని అధికారులు చెబుతున్నారు. నిర్ణీత తేదీల్లోనే దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తామని బోర్డు అధికారులు స్పష్టం చేశారు.

Trending News