కమ్యూనిస్టుల మద్దతు కోరిన టీడీపి

కమ్యూనిస్టుల మద్దతు కోరిన టీడీపి

Last Updated : Oct 15, 2019, 08:40 PM IST
కమ్యూనిస్టుల మద్దతు కోరిన టీడీపి

హైదరాబాద్‌: హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో కమ్యూనిస్టులు తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకాలని టీ-టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి విజ్ఞప్తిచేశారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికకు తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తొలుత టీఆర్ఎస్ పార్టీకి మద్దతు పలికిన సీపీఐకి కాస్త ఆలస్యంగానైనా కనువిప్పు కలిగినందుకు చాలా సంతోషమని అన్నారు. టీఆర్ఎస్‌కు మద్దతు ఉపసంహరించుకున్న కమ్యూనిస్టులు.. టీడీపికి మద్దతిస్తే బాగుంటుందని కోరారు. 

ఈ సందర్భంగా తెలంగాణ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన రావుల చంద్రశేఖర్ రెడ్డి.. ''ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని'' అన్నారు. ఆర్టీసీకి చెందిన వేల కోట్ల ఆస్తులపై ప్రభుత్వ పెద్దల కన్ను పడిందని ఆరోపించారు. ఆర్టీసీ అప్పుల్లో ఉందనే కారణాన్ని సాకుగా చూపి నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందన్నారు. అందులో భాగంగానే బడ్జెట్‌లో ఆర్టీసీకి ఒక్క రూపాయి కూడా కేటాయించని కేసీఆర్ సర్కార్.. ఆఖరికి వరంగల్‌లో ఆర్టీసీ ఆస్తుల్ని ఎంపీ దయాకర్‌కి కట్టబెట్టారని రావుల చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు.

Trending News