chinni krishna: తనపై దాడి చేశారంటూ.. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సినీ రచయిత చిన్ని కృష్ణ

chinni krishna: ప్రముఖ సినీ రచయిత చిన్ని కృష్ణ తనపై కొందరు దాడి చేశారంటూ..పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 19, 2022, 07:49 PM IST
chinni krishna: తనపై దాడి చేశారంటూ.. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సినీ రచయిత చిన్ని కృష్ణ

chinni krishna: టాలీవుడ్ రైటర్ చిన్ని కృష్ణ (chinni krishna) పోలీసులను ఆశ్రయించారు. తనపై కొందరు దాడికి పాల్పడ్డారంటూ..ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ (hyderabad) నగర శివార్లలోని శంకర్‌పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని తన స్థలాన్ని ఆక్రమించుకున్నారని ఇప్పటికే ఆయన పోలీస్‌ స్టేషన్‌ లో కంప్లైంట్ చేశారు. అదే విధంగా తన భూమిని కబ్జా చేశారంటూ హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు సదరు వ్యక్తులు ఆయనపై దాడికి యత్నించారని ఆరోపిస్తూ.. చిన్ని కృష్ణ శనివారం నాడు శంకర్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈయన ఫిర్యాదుపై పోలీసులు  ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

చిన్ని కృష్ణ ఎన్నో బ్లాక్ బాస్టర్ చిత్రాల‌కు క‌థ‌లు అందించారు. స్టార్ హీరోల సినిమాల‌కు క‌థ‌లు అందించి ప్ర‌ముఖ ర‌చయిత‌గా పేరు తెచ్చుకున్నారు. ఆయన కథ అందించిన చిత్రాల్లో అల్లు అర్జున్‌ ‘గంగోత్రి’, బాలకృష్ణ ‘న‌ర‌సింహ‌నాయుడు’, ఇంద్రా (Indra movie) వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు ఉన్నాయి. గ‌త కొన్ని రోజులుగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు.

Also Read: Mohan Babu: ట్రోలర్స్​, మీమర్స్ కు మోహన్​బాబు లీగల్ నోటీసులు.. రూ.10 కోట్ల దావా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News