మాదిగలే టీఆర్‌ఎస్‌ను బొందపెడతారు: ఉత్తమ్

మాదిగలే టీఆర్‌ఎస్‌ను బొందపెడతారు: ఉత్తమ్

Last Updated : Oct 6, 2019, 01:45 PM IST
మాదిగలే టీఆర్‌ఎస్‌ను బొందపెడతారు: ఉత్తమ్

హుజూర్‌నగర్‌: కేసీఆర్‌ మాదిగ సామాజిక వర్గానికి తెలంగాణ కేబినెట్‌లో చోటు కల్పించలేదని, అందుకే మాదిగలే టీఆర్‌ఎస్‌ను బొందపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని టీపీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. రైతులకు రుణమాఫీ చేయలేదు. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ఇవన్నీ చేస్తామని హామీ ఇచ్చిన టీఆర్ఎస్ పార్టీ.. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండానే ప్రజలను ఎలా ఓటు అడుగుతున్నారని ఉత్తమ్ ప్రశ్నించారు. శనివారం హుజూర్‌నగర్‌ క్యాంప్‌ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన ఉత్తమ్‌.. తెలంగాణ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పద్మావతికి వేసి గెలిపించే ఒక ఓటుతో ఆ తర్వాత తాము ఇద్దరం ఎమ్మెల్యేలుగా పనిచేస్తామని అన్నారు. ఒక ఓటు వేసి పద్మావతిని గెలిపిస్తే తాను, పద్మావతి ఇద్దరం కలిసి నియోజకవర్గం అభివృద్ధి కోసం పని చేస్తామని తెలిపారు. 

ఆర్టీసీ సమ్మెపై ఉత్తమ్ స్పందిస్తూ.. ముఖ్యమంత్రి బెదిరింపులకు ఎవరూ భయపడవద్దని ఆర్టీసి కార్మికులకు ధైర్యం చెప్పారు. ఆర్టీసీని లాభాపేక్షతో చూడొద్దని సూచించారు. ఆర్టీసీ ఉద్యోగులకు పూర్తి మద్దతు, సంఘీభావం తెలియజేస్తున్నామని స్పష్టంచేశారు.

Trending News