TSRJC, TSRDC: టిఎస్ఆర్జేసీ, టిఎస్ఆర్డీసీ ఎంట్రన్స్ టెస్ట్ అప్లికేషన్ లాస్ట్ డేట్

TS RJC and TS RDC admissions online application last date: హైదరాబాద్‌: బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ఇంగ్లిష్‌ మీడియంలో ఇంటర్‌ విద్యను అభ్యసించాలనుకునే అభ్యర్థులు, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు (RJC, RDC) కోరుకునే అభ్యర్థులు ఈ నెల 5వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సంస్థ కార్యదర్శి మల్లయ్య బట్టు తెలిపారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 3, 2021, 08:25 AM IST
TSRJC, TSRDC: టిఎస్ఆర్జేసీ, టిఎస్ఆర్డీసీ ఎంట్రన్స్ టెస్ట్ అప్లికేషన్ లాస్ట్ డేట్

TS RJC and TS RDC admissions online application last date: హైదరాబాద్‌: బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ఇంగ్లిష్‌ మీడియంలో ఇంటర్‌ విద్యను అభ్యసించాలనుకునే అభ్యర్థులు, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు (RJC, RDC) కోరుకునే అభ్యర్థులు ఈ నెల 5వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సంస్థ కార్యదర్శి మల్లయ్య బట్టు తెలిపారు. 2021-22 విద్యా సంవత్సరం నుంచి వృత్తి విద్యా కోర్సులలో భాగంగా ఒకేషనల్‌ కోర్సులు కూడా ప్రవేశపెట్టామని మల్లయ్య బట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే ఈ సదవకాశాన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ విద్యార్థులు  సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 

ఈ నెల 25వ తేదీన ఆర్జేసీ, ఆర్డీసీ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపిన మల్లయ్య బట్టు.. మరిన్ని వివరాల కోసం సంస్థ అధికారిక వెబ్‌సైట్  https://mjpabcwreis.cgg.gov.in లోకి లాగిన్ అయి దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.

Trending News