RK Singh: తెలంగాణలో వ్యవసాయ మోటర్లకు మీటర్లు.. కుండబద్దలు కొట్టేసిన కేంద్రమంత్రి

Electricity Meters for Agriculture in Telangana: తెలంగాణ వ్యవసాయ మోటర్లకు విద్యుత్ మీటర్లు బిగిస్తారని జరుగుతున్న ప్రచారంపై కేంద్ర మంత్రి ఆర్‌కే సింగ్ స్పందించారు. తమకు ఆ ఆలోచన లేదని.. అసలు అలాంటి ప్రకటన చేయలేదని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Sep 14, 2023, 06:16 PM IST
RK Singh: తెలంగాణలో వ్యవసాయ మోటర్లకు మీటర్లు.. కుండబద్దలు కొట్టేసిన కేంద్రమంత్రి

Electricity Meters for Agriculture in Telangana: గత తొమ్మిదేళ్లలో దేశవ్యాప్తంగా మారుమూరు ప్రాంతంలో ఉన్న చాలా గ్రామాలకు తాము అధికారంలో వచ్చాక కరెంట్ కనెక్షన్లు ఇచ్చామని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్ తెలిపారు. మొత్తం 2.9 కోట్ల ఇళ్లకు కరెంట్ కనెక్షన్లు ఇచ్చామని చెప్పారు. ప్రపంచ చరిత్రలో ఇంత తక్కువ సమయంలో ఇన్ని ఎక్కువ ఇళ్లకు కరెంట్ కనెక్షన్ ఇచ్చిన సందర్భాలు లేవని వ్యాఖ్యానించారు. దేశం మొత్తాన్ని ఒకే గ్రేడ్ కింద తీసుకువచ్చి ఒక లక్ష 97 వేల కిలోమీటర్ల ట్రాన్స్మిషన్ లైన్లను వేశామన్నారు. లేహ్  లడాఖ్ మొదలుకొని కన్యాకుమారి వరకు ప్రతి ప్రాంతాన్ని కలుపుతూ ఈ లైన్ వేశామన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇంత పెద్ద గ్రిడ్ మరొకటి లేదన్నారు.

"దీని ద్వారా ఏకకాలంలో 120 మెగావాట్ల విద్యుత్తును ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పంపే వీలు కలిగింది. పంపిణీ సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేశాం. విద్యుదుత్పత్తి సంస్థలకు ఉన్న బకాయిలను దాదాపు సగానికి పైగా తగ్గించగలిగాం.. 1.35 లక్షల కోట్లు ఉన్న బకాయిలు ప్రస్తుతం 66 కోట్లుగా ఉన్నాయి. విద్యుత్ పంపిణీలో ఉన్నటువంటి నష్టాలను కూడా గణనీయంగా తగ్గించడంలో విజయం సాధించాం.. 22.8 శాతం ఉన్న నష్టాలను 16 శాతం తీసుకొచ్చాం.. వచ్చే ఏడాదికల్లా ఇది 13 శాతం చేరుతుందని అంచనా వేస్తున్నాం. 2030 నాటికి మన వినియోగంలో 40 శాతం శిలాజితర ఇంధనాలు ఉండాలని అంతర్జాతీయ వేదికల ద్వారా నిర్ణయించా. కానీ మేం తొమ్మిది ఏళ్ల ముందుగానే ఈ లక్ష్యాన్ని చేరుకున్నాం.

ఆర్‌ఈసీలో తెలంగాణకు రూ.లక్ష 57 వేల కోట్లు మంజూరు చేశాం. రూ.19,700 కోట్లు మినహా మిగిలిన మొత్తాన్ని ఇప్పటికే రాష్ట్రానికి అందజేశాం. పీఎఫ్‌సీ ద్వారా లక్షా ఎనిమిది వేల కోట్లు మంజూరైతే.. 91 వేల కోట్లు విడుదల చేశాం. RFC, PFC లద్వారా తెలంగాణ రాష్ట్రానికి విడుదల చేయాల్సిన నిధుల్లో సింహభాగం ఇప్పటికే విడుదల చేశాం. కానీ.. కాళేశ్వరం, యాదాద్రి, సీతారామ ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం వద్ద రుణాలను తిరిగి చెల్లించేందుకు అవసరమైన స్తోమత లేని కారణంగా ఆ రుణాలను నిలిపివేశాం. రాష్ట్ర ప్రభుత్వం చాలా విషయాల్లో అబద్ధాలు చెబుతున్న కారణంగానే రుణాలను ఆపాల్సి వస్తుంది.

తెలంగాణ ముఖ్యమంత్రి బీజేపీ అధికారంలోకి వస్తే వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెడతారంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. నేనెప్పుడూ ఇలాంటి ప్రకటన చేయలేదు. రైతులను మినహాయించి ప్రతిచోట మీటర్లు ఉండాలని మాత్రమే మేము చెప్పాం. ఇలా అబద్ధాలను ప్రచారం చేస్తే మేము కూడా సరైన సమాధానం చెబుతాం. ప్రభుత్వ సంస్థల ప్రైవేటుకరణ విషయంలోనూ ఇలాగే కేసిఆర్ దుష్ప్రచారం చేస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వానికి ప్రైవేటీకరణ పై ఇలాంటి ఆలోచన లేదు. FRBM పరిమితుల గురించి కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంటుంది ఇది మా పరిధిలోని అంశం కాదు. రుణాలు చెల్లించే సామర్థ్యం ఆధారంగానే కొత్త రుణాలు ఇస్తారు.." అని కేంద్ర మంత్రి ఆర్‌కే సింగ్ క్లారిటీ ఇచ్చేశారు. 

కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌తో కలిసి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మోటర్లకు మీటర్లు బిగించాలని కేంద్రం ఒత్తిడి చేస్తుందని బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. తెలంగాణ రైతంగానికి విజ్ఞప్తి చేస్తున్నానని.. మోటర్లకు మీటర్లు పెట్టాలా లేదా అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం కేంద్రానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. దేశంలో ఏ రాష్ట్రానికి చేయనంత సహాయం తెలంగాణ రాష్ట్రానికి చేస్తుంటే.. కేంద్రంపై కేసీఆర్ తప్పుడు ఆరోపణలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. 

Also Read: Jawan OTT Release Update: దిమ్మతిరిగే రేటుకు జవాన్ ఓటీటీ రైట్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?  

Also Read: Nipah Virus Latest Updates: ముంచుకొస్తున్న నిపా వైరస్ ముప్పు.. మరో ఇద్దరు మృతి.. రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News