Hemanth murder case: ఎవ్వరినీ విడిచిపెట్టే ప్రసక్తే లేదు: సిపి

పరువు హత్యకు గురైన హేమంత్ మర్డర్ కేసులో ( Hemanth murder case ) అవంతి మేనమామ యుగంధర్ రెడ్డి, తండ్రి లక్ష్మారెడ్డిలను 6 రోజుల పాటు కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టు నుండి పోలీసులకు అనుమతి లభించింది. హేమంత్ హత్య కేసులో ఇప్పటి వరకు 14 మందిని అరెస్ట్ చేసిన గచ్చిబౌలి పోలీసులు పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు.

Last Updated : Sep 29, 2020, 08:31 PM IST
Hemanth murder case: ఎవ్వరినీ విడిచిపెట్టే ప్రసక్తే లేదు: సిపి

హైదరాబాద్: పరువు హత్యకు గురైన హేమంత్ మర్డర్ కేసులో ( Hemanth murder case ) అవంతి మేనమామ యుగంధర్ రెడ్డి, తండ్రి లక్ష్మారెడ్డిలను 6 రోజుల పాటు కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టు నుండి పోలీసులకు అనుమతి లభించింది. హేమంత్ హత్య కేసులో ఇప్పటి వరకు 14 మందిని అరెస్ట్ చేసిన గచ్చిబౌలి పోలీసులు పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. ఈ కేసు వెనుక ఎవరి ప్రోద్బలం ఉన్నా, ఎవరి ప్రమేయం ఉన్నా విడిచిపెట్టే ప్రసక్తే లేదని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ ( Cyberabad CP VC Sajjanar ) స్పష్టంచేశారు. హేమంత్ మర్డర్ కేసుపై సైబరాబాద్ సిపి వీసి సజ్జనార్ మాట్లాడుతూ.. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ( Fast track court ) ద్వారా ఈ కేసు విచారణ చేపట్టి వీలైనంత త్వరగా నిందితులకు శిక్ష పడేలా చూస్తామని అన్నారు. Also read : Mumaith Khan news: ముమైత్ ఖాన్ క్యాబ్ డ్రైవర్‌ని చీట్ చేసిందా ?

హేమంత్ భార్య అవంతి ( Hemanth's wife Avanthi ), హేమంత్ సోదరుడు, తల్లిదండ్రులు మంగళవారం పోలీసులను కలిశారు. ఈ సందర్భంగా తన తల్లిదండ్రుల నుంచి తనకు, తన కుటుంబానికి ప్రాణ హాని ( Life threat ) ఉందని అవంతి పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. 6 గంటలపాటు హేమంత్ కుటుంబసభ్యులు చెప్పిన వాంగ్మూలాన్ని నమోదు చేసిన పోలీసులు అందులోని వివరాల ఆధారంగా విచారణ జరుపుతున్నారు. తనను పెళ్లి చేసుకున్నాడనే కోపంతోనే తన తల్లిదండ్రులు ఈ దారుణానికి ఒడిగట్టారని, ఇకపై తనకు తల్లిదండ్రులు లేరని అనుకుంటానని భర్త హేమంత్ దారుణ హత్యకు గురైన అనంతరం అవంతి ఆవేదన వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. Also read : COVID19: తెలంగాణలో కొత్తగా 2,072 కరోనా కేసులు

Trending News