YS Sharmila: వైఎస్ షర్మిల సంచలన నిర్ణయం.. ఎన్నికల్లో పోటీకి దూరం..!

Telangana Assembly Election 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు వైఎస్ షర్మిల. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని వెల్లడించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదనే ఉద్దేశంతో పోటీకి దూరంగా ఉంటామని తెలిపారు.   

Written by - Ashok Krindinti | Last Updated : Nov 3, 2023, 01:12 PM IST
YS Sharmila: వైఎస్ షర్మిల సంచలన నిర్ణయం.. ఎన్నికల్లో పోటీకి దూరం..!

Telangana Assembly Election 2023: వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల పోటీకి దూరంగా ఉంటామని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీని ఓడించడం తమ ఉద్దేశం కాదని చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చిలనివ్వి వద్దనే ఈ నిర్ణయం తీసుకుంటున్నామని తెలిపారు. ఏ పార్టీ కోసం కాదని.. తెలంగాణ ప్రజల కోసం తీసుకుంటున్న నిర్ణయమని అన్నారు. తాము పోటీ చేస్తే కేసీఆర్‌కి లాభం జరుగుతుందని మేధావులు చెప్పారని.. అందుకే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.

కేసీఆర్ ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉందని.. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను చీలిస్తే బీఆర్ఎస్ లాభపడి మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారని అన్నారు. ఓటు బ్యాంక్ చీల్చొద్దని ఎంతో మంది మేధావులు, మీడియా అధిపతులు తమకు కోరారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నామన్నారు. తెలంగాణ ప్రజల కోసం కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నామన్నారు. 

గత కొంతకాలంగా వైఎస్సార్టీపీ-కాంగ్రెస్ పార్టీల విలీనంపై పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వైఎఎస్ షర్మిల ఢిల్లీకి వెళ్లి సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కలవడంతో రేపో మాపో విలీనం అనుకున్నారు. అయితే అనూహ్య పరిణామాల మధ్య విలీనంపై అడుగులు ముందుకు పడలేదు. వైఎస్సార్టీపీతో చేతులు కలిపేందుకు రేవంత్ రెడ్డితోపాటు ఇతర నాయకులు అభ్యంతరం చెప్పినట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో టీడీపీతో పొత్తు వల్ల జరిగిన నష్టాన్ని అధిష్టానానికి వివరించి.. విలీనం అంశానికి బ్రేక్ వేసినట్లు తెలిసింది. షర్మిల పార్టీని విలీనం చేసినా.. ఆమెను ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలకే పరిమితం చేయాలని చెప్పారు. అయితే షర్మిల తెలంగాణ రాజకీయాల్లోనే ఉంటానని స్పష్టం చేశారు. 

దీంతో విలీనం అంశం కరుమరుగైంది. 119 స్థానాల్లో పోటీ చేసేందుకు వైఎస్సార్టీపీ రెడీ కూడా అయింది. అభ్యర్థుల ప్రకటన ఉంటుందని ఆ పార్టీ నేతలు అనుకున్నారు. అయితే ఊహించని విధంగా వైఎస్ షర్మిల పోటీ నుంచి తప్పుకుంటున్నామని ప్రకటించారు.  

Also Read: IND Vs SL Highlights: శ్రీలంకకు టీమిండియా అదిరిపోయే పంచ్.. సెమీస్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ..!  

Also Read: Skin Care Tips: ఈ పదార్ధాలు దూరం చేయకుంటే మీ చర్మం కాంతి విహీనంగా అందవికారంగా మారడం

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News