Zee Telugu News Bonalu Song: బోనాల పండగను వర్ణిస్తూ జీ తెలుగు న్యూస్ బోనాలు సాంగ్‌

Bonalu songs 2022: హైదరాబాద్‌లో బోనాల పండుగ అంటే మామూలు హడావుడి ఉండదు.. మిగతా పండగలన్నీ ఓ ఎత్తయితే, బోనాల పండగ మరో ఎత్తు. హైదరాబాద్ భాగ్యనగరం నుండి పల్లెటూర్ల వరకు పల్లెపల్లెనా పండగ వాతావరణం నింపే బోనాల ఉత్సవాల ముందు ఏదీ సాటి రాదు.

  • Zee Media Bureau
  • Jul 15, 2022, 06:47 PM IST

Bonalu songs 2022: హైదరాబాద్‌లో గోల్కొండ ఖిలాలో అమ్మవార్లకు జనం తొలి బోనమెత్తగా.. పాత బస్తీలో లష్కర్ బోనాలు, సికింద్రాబాద్‌లో ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారికి సమర్పించే బోనాలు.. ఇలా నగరం నలుమూలలా ప్రతీ ఆదివారం ఏదో ఓ చోట పోతరాజుల సందడితో, బోనాలు, ఫలహారం బండ్ల ఊరేగింపులతో శోభాయమానంగా కనిపిస్తుంది. బంధుమిత్రుల కోలాహలం మధ్య వేడుక చేసుకునే బోనాల పండగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక. అందుకే అమ్మవార్లకు బోనం సమర్పిస్తూ, అందరికీ సకల శుభాలు కలగాలని మనసారా కోరుకుంటూ జీ తెలుగు న్యూస్ బోనాల పండగ శుభాకాంక్షలతో ఓ పాటను విడుదల చేయడం జరిగింది. '' అమ్మా హే జగదంబే.... అంబే... అంబే...  సౌభాగ్యదాయి '' అంటూ జీ తెలుగు న్యూస్ రూపొందించిన బోనాలు సాంగ్‌ భక్తులను ఆకట్టుకుంటోంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఇదిగో జీ తెలుగు న్యూస్ బోనాల సాంగ్ మీ కోసం..

Video ThumbnailPlay icon

Trending News