Chiranjeevi: నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం నన్ను కలిచివేసింది: చిరంజీవి

Chiranjeevi: బంజారాహిల్స్‌లోని డీఏవీ పబ్లిక్‌ స్కూల్‌లో నాలుగేళ్ల చిన్నారిపై ఇటీవల జరిగిన అఘాయిత్యం తనను తీవ్రంగా కలచివేసిందని ప్రముఖ సినీనటుడు చిరంజీవి తెలిపారు. ఈమేరకు ఆయన ట్విటర్‌ ద్వారా ఓ ప్రకటన విడుదల చేశారు.

  • Zee Media Bureau
  • Oct 26, 2022, 05:34 PM IST

Chiranjeevi: బంజారాహిల్స్‌లోని డీఏవీ పబ్లిక్‌ స్కూల్‌లో నాలుగేళ్ల చిన్నారిపై ఇటీవల జరిగిన అఘాయిత్యం తనను తీవ్రంగా కలచివేసిందని ప్రముఖ సినీనటుడు చిరంజీవి తెలిపారు. ఈమేరకు ఆయన ట్విటర్‌ ద్వారా ఓ ప్రకటన విడుదల చేశారు. ఆటవిక సంస్కృతి నుంచి ఆనవాళ్లు మోసుకొస్తున్న కొందరు మృగాళ్ల వికృత చేష్టలకు కఠిన శిక్షలు విధించడమే సరైన చర్య అని ఆయన అభిప్రాయపడ్డారు. శిక్షలు వేగవంతంగా విధించడంతో పాటు అన్ని విద్యాసంస్థల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలన్నారు. భావితరాలకు భరోసా కల్పించడం మనందరి బాధ్యతగా భావిస్తున్నా’’ అని చిరంజీవి ట్విటర్‌లో పేర్కొన్నారు.

Video ThumbnailPlay icon

Trending News