Leopard Attack In Tirumala: తిరుమలలో చిన్నారిపై చిరుత దాడి..

Leopard Attack In Tirumala: అలిపిరి నడక దారిలో ఓ చిన్నారిపై చిరుత దాడి ఘటన కలకలం సృష్టించింది. అక్కడున్న భక్లులు, స్థానికులు, భద్రతా సిబ్బంది అప్రమత్తతో వ్యవహరించడంతో బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. 

  • Zee Media Bureau
  • Jun 23, 2023, 10:06 AM IST

Leopard Attack In Tirumala: అలిపిరి నడక దారిలో ఓ చిన్నారిపై చిరుత దాడి ఘటన కలకలం సృష్టించింది. అక్కడున్న భక్లులు, స్థానికులు, భద్రతా సిబ్బంది అప్రమత్తతో వ్యవహరించడంతో బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన దంపతులు తమ కుమారుడితో కలిసి కాలినడకన అలిపిరి నుంచి తిరుమలకు బయలుదేరారు. మొదటి ఘాట్‌ రోడ్డులోని ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయానికి సమీపంలో కూర్చుని ఆహారం తీసుకుంటుండగా చిరుత దాడి చేసింది.. బాలుడి తలను నోటకరచుకుని అడవిలోకి తీసుకుపోయింది. అక్కడే ఉన్న వారు కేకలు వేయడంతో భయపడిన చిరుత.. పోలీస్‌ ఔట్‌పోస్ట్‌ వద్ద బాలుడిని విడిచి పారిపోయింది.

Video ThumbnailPlay icon

Trending News