Rains Alert: తెలంగాణలో వానలు వరదలు..మరో మూడు రోజులపాటు అలర్ట్..!

Rains Alert: తెలంగాణలో వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. గత రెండురోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులు, వాగులు,వంకలు పొంగిపోర్లుతున్నాయి. మరో మూడురోజులపాటు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

  • Zee Media Bureau
  • Jul 9, 2022, 10:48 AM IST

Rains Alert: రుతు పవనాలు, ఉపరిత ఆవర్తనం, అల్పపీడనం ప్రభావంతో తెలంగాణవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. మరో మూడురోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంచిర్యాల, జగిత్యాల, కామారెడ్డి, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, మహబూబ్‌నగర్‌, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఇదే వాతావరణం ఉండనుంది.

Video ThumbnailPlay icon

Trending News