కెనడాలో పాదచారులపైకి దూసుకెళ్లిన వ్యాన్‌

కెనడాలోని టొరంటో నగరంలో ఓ దుండగుడు వ్యానుతో దాడికి పాల్పడ్డాడు.

Last Updated : Apr 24, 2018, 07:47 AM IST
కెనడాలో పాదచారులపైకి దూసుకెళ్లిన వ్యాన్‌

కెనడాలోని టొరంటో నగరంలో ఓ దుండగుడు వ్యానుతో దాడికి పాల్పడ్డాడు. సెంట్రల్‌ టొరంటోలోని యాంజ్‌ స్ట్రీట్‌లో సోమవారం మధ్యాహ్నం తెలుపు రంగు వ్యాను ఒకటి హఠాత్తుగా పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందినట్లు, 16 మంది గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. గాయపడ్డవారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నట్లు తెలిపారు.

ఈ ప్రమాదంపై మధ్యాహ్నం 1.30 గంటలకు తమకు సమాచారం అందినట్లు వెల్లడించారు. పాదచారుల్ని ఢీకొట్టిన అనంతరం నిందితుడు ఘటనాస్థలి నుంచి పరారయ్యాడన్నారు. వెంటనే పోలీసులు వ్యాను వెంబడించి డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. దాడికి గల కారణాలు ఇంకావెల్లడికాలేదు. ఈ ప్రమాదం నేపథ్యంలో ఇక్కడి సబ్‌వే ను మూసివేసిన పోలీసులు.. ఘటనాస్థలికి రావొద్దని ప్రజలకు సూచించారు.

 

 

Trending News