అమేజాన్ చేతుల్లోకి ఫ్లిప్‌కార్ట్ ? వాల్‌మార్ట్‌తో తలపడుతున్న అమెజాన్ ?

భారత్‌లో ఆన్‌లైన్ రీటెయిల్‌ రంగంలో 40 శాతం వాటా కలిగిన స్వదేశీ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ను కొనుగోలు చేసేందుకు అమెజాన్ ప్రయత్నాలు

Last Updated : Apr 5, 2018, 12:57 AM IST
అమేజాన్ చేతుల్లోకి ఫ్లిప్‌కార్ట్ ? వాల్‌మార్ట్‌తో తలపడుతున్న అమెజాన్ ?

భారత్‌లో ఆన్‌లైన్ రీటెయిల్‌ రంగంలో 40 శాతం వాటా కలిగిన స్వదేశీ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ను కొనుగోలు చేసేందుకు అమెరికన్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఓవైపు ఫ్లిప్‌కార్ట్ తమ సంస్థలో వాటా అమ్మకం కోసం అమెరికన్ రీటేల్ దిగ్గజం వాల్‌మార్ట్‌తో చర్చలు జరుపుతుండగానే మరోవైపు ఫ్లిప్‌కార్ట్‌కు భారీ ఆఫర్ ఇచ్చి అయినా సరే ఆ వాటాను సొంతం చేసుకునేందుకు అమెజాన్ ప్రయత్నిస్తున్నట్టుగా రాయ్‌టర్స్ పేర్కొంది. ఇండియాలో అంతకంతకూ వృద్ధి సాధిస్తున్న ఈ-కామర్స్ రంగంలో అగ్రగామిగా వుండాలనే ఉద్దేశంతోనే అమెజాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాయ్ టర్స్ కథనం స్పష్టంచేసింది. ఫ్లిప్‌కార్ట్‌లో 40 శాతం వాటా కొనుగోలు కోసం ప్రపంచ వ్యాపార దిగ్గజం వాల్‌మార్ట్ సంప్రదింపులు జరుపుతోన్న సంగతి తెలిసిందే. అయితే, ఫ్లిప్‌కార్ట్ మాత్రం వాల్‌మార్ట్‌వైపే ఆసక్తి కనబరుస్తున్నట్లు బిజినెస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ డీల్ ఎంతమేరకు ఏంటనే విషయాలపై అమెజాన్‌ కానీ, ఫ్లిప్‌కార్ట్‌ కానీ అధికారికంగా స్పందించకపోవడంతో దీనిపై ప్రస్తుతానికి ఓ స్పష్టత కొరవడింది. 

ఫ్లిప్‌కార్ట్ అమ్మడానికి సిద్ధపడుతున్న 40 శాతం వాటాల్లో అధికంగా ప్రైమరీ, సెకండరీ షేర్లనే వాల్‌మార్ట్ కొనుగోలు చేయనున్నట్టు సమాచారం. ఆ వాటాల విలువ సుమారు 2,100 కోట్ల డాలర్లుగా వుంటుందని అంచనా.

Trending News