'కరోనా' మృతుల సంఖ్యలో ఇటలీని దాటేసిన అమెరికా

అగ్రరాజ్యం అమెరికాలో 'కరోనా వైరస్' మృత్యుక్రీడ ఆడుతోంది. అమెరికా మొత్తాన్ని గడగడా వణికిస్తోంది. అల్లకల్లోలం సృష్టిస్తోంది. కరోనా దెబ్బకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు.

Last Updated : Apr 12, 2020, 10:40 AM IST
'కరోనా' మృతుల సంఖ్యలో ఇటలీని దాటేసిన అమెరికా

అగ్రరాజ్యం అమెరికాలో 'కరోనా వైరస్' మృత్యుక్రీడ ఆడుతోంది. అమెరికా మొత్తాన్ని గడగడా వణికిస్తోంది. అల్లకల్లోలం సృష్టిస్తోంది. కరోనా దెబ్బకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు. 

చైనాలో మొదలైన  కరోనా వైరస్.. క్రమక్రమంగా అన్ని దేశాలకు వ్యాపించింది. చైనా తర్వాత ఎక్కువ వైరస్ బారిన పడ్డ దేశంక ఇటలీ. ఇప్పటికే ఈ దేశంలో 20 వేల మంది మృతి చెందారు. ఐతే తాజాగా కరోనా వైరస్ మృతుల సంఖ్యలో ఇటలీని అమెరికా దాటి పోయింది. నిన్న సాయంత్రం వరకు అమెరికాలో మృతి చెందిన వారి సంఖ్య 20 వేల 110కి చేరుకుంది. శుక్రవారమే అత్యధిక సంఖ్యలో మరణాలు చోటు చేసుకోవడం గుబులు పుట్టిస్తోంది. శుక్రవారం ఒక్క రోజే మొత్తం 2 వేల 57 మంది మృతి చెందారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 

అంతే కాదు అమెరికాలో కరోనా వైరస్ బారిన పడ్డ వారి సంఖ్య 5 లక్షలకు చేరుకుంది. అంటే మొత్తం ప్రపంచ దేశాలలో నమోదైన సంఖ్యలో సగం అన్నమాట. ప్రపంచ దేశాల్లో మొత్తం కలిపి 10 లక్షల 50 వేల మంది కరోనా వైరస్ బారిన పడితే .. అందులో 5 లక్షల పాజిటివ్ కేసులు అమెరికాలోనే నమోదయ్యాయి. 

అమెరికా, ఇటలీ తర్వాత కరోనా వైరస్ మృతుల సంఖ్యలో ఫ్రాన్స్ ముందు వరుసలో ఉంది. ఫ్రాన్స్ లో కరోనా బారిన పడి చనిపోయిన వారి సంఖ్య  13 వేల 832. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News