Bell Helicopter Crashes: నాడు వైఎస్ఆర్, నేడు ఇరాన్ అధ్యక్షుడు మరణం వెనుక ఆ కంపెనీ హెలికాప్టరే

Bell Helicopter Crashes: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలీకాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆయనతో పాటు మరో 9 మంది మరణించిన ఈ ఘటన నాటి వైఎస్ మరణాన్ని గుర్తు చేస్తోంది. నాడు వైఎస్ఆర్‌ను నేడు ఇరాన్ అధ్యక్షుడిని పొట్టన పెట్టుకున్న హెలీకాప్టర్ ఒక్కటే కావడం గమనార్హం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 20, 2024, 12:07 PM IST
Bell Helicopter Crashes: నాడు వైఎస్ఆర్, నేడు ఇరాన్ అధ్యక్షుడు మరణం వెనుక ఆ కంపెనీ హెలికాప్టరే

Bell Helicopter Crashes: ఇరాన్-అజర్ బైజాన్ పర్వత శ్రేణుల్లో హెలీకాప్టర్ కుప్పకూలింది. దట్టమైన పొగమంచు, ప్రతికూల వాతావరణంతో ఛాపర్ క్రాష్ అయింది. ఇందులో ప్రయాణిస్తున్న ఇరాన్ దేశాధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో పాటు విదేశాంగమంత్రి అమీరబ్దుల్లాహియాన్ సహా 10 మంది మరణించారు. ఈ ప్రమాదం 15 ఏళ్ల క్రితం జరిగిన ఏపీ ముఖ్యమంంత్రి వైఎస్ఆర్ హెలీకాప్టర్ దుర్ఘటనను గుర్తు చేస్తోంది. 

ఇరాన్-అజర్ బైజాన్ సరిహద్దుల్లో నిర్మించిన డ్యామ్ ప్రారంభోత్సవానికి హాజరై తిరిగొస్తుండగా దేశాధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, విదేశాంగమంత్రి అమీరబ్దుల్లాహియాన్, ఉన్నతాధికారులు ప్రయాణిస్తున్న బెల్ 212 హెలీకాప్టర్ అజర్ బైజాన్ పర్వత శ్రేణుల్లో, దట్టమైన అడవుల్లో కుప్పకూలిపోయింది. దట్టమైన పొగమంచు ప్రతికూల వాతావరణమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. మొత్తం 10 మంది ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఛాపర్ ప్రమాదం 15 ఏళ్ల క్రితం నల్లమల అడవుల్లో కుప్పకూలిన నాటి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ప్రయాణించిన హెలీకాప్టర్ ఘటనను గుర్తు చేస్తోంది. అప్పుడు కూడా ప్రమాదం జరిగిన 14 గంటల తరువాత రెస్క్యూ బృందాలు తీవ్రంగా గాలించిన తరువాత ఛాపర్ శకలాలు బయటపడ్డాయి. ఇప్పుడు కూడా ప్రమాదం జరిగిన 18 గంటల తరువాతే ఎక్కడ కుప్పకూలిందో గుర్తించగలిగారు. 

వైఎస్ఆర్, ఇరాన్ అధ్యక్షుడి మరణ ఘటనల్లో సామీప్యతలు

నాడు వైఎస్ఆర్, నేడు ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీని పొట్టనబెట్టుకున్నది ఒకే కంపెనీ హెలీకాప్టర్ కావడం గమనార్హం. నాడు వైఎస్ఆర్‌ను పొట్టన బెట్టుకున్నది బెల్ కంపెనీకు చెందిన 430 ఛాపర్ అయితే నేడు ఇరాన్ అధ్యక్షుడి మరణానికి కారణమైంది అదే కంపెనీకు చెందిన బెల్ 212 హెలీకాప్టర్. ఇద్దరూ రెండోసారి  ఎన్నికల్లో గెలిచిన తరువాత హెలీకాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఇద్దరూ మంచి ప్రజాకర్షణ కలిగిన నేతలుగా గుర్తింపు పొందినవారే. 

ప్రపంచవ్యాప్తంగా బెలి హెలీకాప్టర్ దుర్ఘటనలు ఎప్పుడు ఎక్కడ జరిగాయి, ఎంతమంది మరణించారో తెలుసుకుందాం. ఈ హెలీకాప్టర్ ఇంకెంతమందిని బలి తీసుకుంటుందోననే ఆందోళన వ్యక్తమౌతోంది ఇప్పుడు. 

బెల్ హెలీకాప్టర్ ప్రమాదాలు, మృతుల సంఖ్య

1982 సెప్టెంబర్ 14వ తేదీన బెల్ 212 హెలీకాప్టర్ నార్త్ సీలో కుప్పకూలడంతో 6 మంది మరణించారు.
1986 జూన్ 18 వతేదీన బెల్ 206 హెలీకాప్టర్ గ్రాండ్ కాన్యాన్ ఫ్లైట్‌ను డీ కొనడంతో  5 మంది మరణం.
1990 ఆగస్టు 27 వతేదీన బెల్ 206 హెలీకాప్టర్ దుర్ఘటనలో 5 మంది మృతి
1991 ఏప్రిల్ 4వ తేదీన బెల్ 412 హెలీకాప్టర్ ఫిలడెల్ఫియాలో కుప్పకూలడంతో 5 మంది సిబ్బంది మృతి
2006 డిసెంబర్ 10న బెల్ 412 హెలీకాప్టర్ కాలిఫోర్నియాలో కుప్పకూలడంతో ముగ్గురు మరణించారు.
2009 మార్చ్ 25వ తేదీన బెల్ 206 హెలీకాప్టర్ టర్కీలోని కేస్ పర్వతాల్లో కుప్పకూలి 6 మంది మరణించారు.
2009 సెప్టెంబర్ 2వ తేదీన బెల్ 430 హెలీకాప్టర్ నల్లమల అడవుల్లో కుప్పకూలి నాటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ మరణించారు.
2016 జూలై 6వ తేదీన బెల్ 525 హెలీకాప్టర్ ఇటలీలో కుప్పకూలడంతో ఇద్దరు మృతి
2018 జనవరి 17న బెల్ యూహెచ్-1 హెలీకాప్టర్ మెక్సికోలో కుప్పకూలి 5 గురి మరణానికి కారణమైంది.

Also read: Iran President killed: ఇరాన్ దేశాధ్యక్షుడు ఇబ్రహీం రైసీ సహా విదేశాంగ మంత్రి ఛాపర్ క్రాష్‌లో దుర్మరణం

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News