Global Times Survey: ప్రధాని నరేంద్ర మోదీకే జై కొట్టిన చైనా!

Global Times Survey About Narendra Modi  | సర్వేలో ఆసక్తికర విషయం వెలుగుచూసింది. తమ దేశ అధినేతల పాలన కన్నా భారత ప్రధాని నరేంద్ర మోదీ పాలనకు 50 శాతం పౌరులు జై కొట్టినట్లు సర్వేలో తేలింది. భారత్‌ను ద్వేషించే చైనీయులలో సగం మంది మన ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని ప్రశంసించారు.

Last Updated : Aug 27, 2020, 10:52 AM IST
  • గాల్వయ లోయ వివాదం తర్వాత 59 చైనా యాప్స్‌పై నిషేధం
  • గ్లోబల్ టైమ్స్ సర్వేలో ప్రధాని మోదీకి 50శాతం చైనా ప్రజల ఓటు
  • ప్రస్తుత పరిస్థితుల్లో భారత ప్రభుత్వంపై ప్రశంసలు మామూలు కాదు
Global Times Survey: ప్రధాని నరేంద్ర మోదీకే జై కొట్టిన చైనా!

గాల్వన్ లోయ (Galwan Valley)లో 20 మంది భారత జవాన్లను పొట్టనపెట్టుకున్న చైనాకు భారత్ తగిన గుణపాఠం చెబుతోంది. వ్యాపార, ఆర్థిక పరంగా దెబ్బతీసేందుకు 59 చైనా యాప్స్‌పై నిషేధం (India Bans 59 Chinese Apps) విధించింది. చైనా ఉత్పత్తుల దిగుమతులపై సైతం కొన్ని కఠిన నిర్ణయాల్ని అమలు చేస్తోంది. అమెరికా సైతం భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) నిర్ణయాన్ని స్వాగతించడంతో పాటు చైనా కంపెనీలకు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ నేపథ్యంలో నిర్వహించిన సర్వే (Global Times Survey)లో ఆసక్తికర విషయం వెలుగుచూసింది. తమ దేశ అధినేతల పాలన కన్నా భారత ప్రధాని నరేంద్ర మోదీ పాలనకు 50 శాతం పౌరులు జై కొట్టినట్లు సర్వేలో తేలింది. Health Tips: జలుబు వస్తే కంగారొద్దు.. కరోనానో కాదో ఇలా గుర్తించండి 
Effects Of Skipping Breakfast: బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే ఎన్ని నష్టాలో తెలుసా..!
  

చైనా ప్రభుత్వ అధికార మీడియా గ్లోబల్ టైమ్స్ ఇటీవల సర్వే నిర్వహించింది. 50 శాతం చైనా పౌరులు భారత ప్రధాని నరేంద్ర మోదీ  (PM Modi) నాయకత్వం, పాలనను ప్రశంసిస్తున్నారు. కాగా, సగం మంది చైనీయులే తమ నేతల తీరుకు మద్దతు తెలపడం గమనార్హం. అది కూడా గాల్వన్ లోయ వివాదం తర్వాత జరిపిన సర్వేలో నరేంద్ర మోదీ పాలనకు సగం మంది చైనీయులు జై కొట్టడం మామూలు విషయం కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. Gold Rate: దిగొచ్చిన బంగారం ధరలు.. షాకిచ్చిన వెండి

 భారత్‌లో చైనా వ్యతిరేక నిర్ణయాలు కొనసాగుతూనే ఉంటాయని 70శాతం చైనీయులు భావిస్తుండగా, ఢిల్లీ-బీజింగ్ మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయని కేవలం 30శాతం చైనీయులు భావిస్తున్నారట. భారత్, చైనాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సుదీర్ఘకాలం కొనసాగుతాయని 25శాతం మంది భావిస్తుండగా, కొంతకాలం వరకే ఉంటాయని 9శాతం ప్రతినిధులు ఈ సర్వేలో తెలిపారు. అయితే హువావే కంపెనీ మాత్రం భారత్‌లో సత్సంబంధాలతో వ్యాపారాన్ని నిలబెట్టుకోవాలని భావిస్తున్నట్లు ఫైనాన్షియల్ టైమ్స్ రిపోర్ట్ చేసింది. కానీ భారత్ మాత్రం చైనా కంపెనీతో దశలవారీగా వ్యాపారానికి స్వస్తి పలకాలని భావిస్తున్నట్లు తెలిపింది. RBI Recruitment 2020: ఆర్బీఐ జాబ్స్‌కు అప్లై చేయలేదా.. మరో ఛాన్స్ వచ్చింది 
COVID19 Deaths In India: భారత్‌లో 87శాతం కరోనా మరణాలు ఆ వయసు వారిలోనే..

 

Trending News