10 రోజుల్లో వెయ్యి పడకల ఆస్పత్రి- చైనా ఘనత

చారిత్రక కట్టడాలు, ప్రపంచంలో గొప్పగా నిర్మాణం చేసే ఘనత చైనా సొంతం. ఇప్పుడు కరోనా వైరస్ తో గజగజలాడుతున్న చైనా .  .  దీన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు తాజాగా అలాంటి ఘనతనే చాటి చెప్పింది. ఆసియాలో ఆర్ధికంగా బలంగా ఉన్న చైనా ..  తలచుకుంటే చేయలేనిది అంటే ఏదీ లేదని నిరూపించింది.

Last Updated : Feb 3, 2020, 09:05 AM IST
10 రోజుల్లో వెయ్యి పడకల ఆస్పత్రి- చైనా ఘనత

చారిత్రక కట్టడాలు, ప్రపంచంలో గొప్పగా నిర్మాణం చేసే ఘనత చైనా సొంతం. ఇప్పుడు కరోనా వైరస్‌తో గజగజలాడుతున్న చైనా .  .  దీన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు తాజాగా అలాంటి ఘనతనే చాటి చెప్పింది. ఆసియాలో ఆర్ధికంగా బలంగా ఉన్న చైనా ..  తలచుకుంటే చేయలేనిది అంటే ఏదీ లేదని నిరూపించింది. అవును.. కరోనా వైరస్‌ను ఎదుర్కునేందుకు ఏకంగా ఓ ఆస్పత్రినే నిర్మించింది. అదీ పది రోజుల్లో.  సో.. దటీజ్ చైనా అని మరోసారి నిరూపించుకుంది.  

361కి చేరిన మృతుల సంఖ్య
చైనాలోని వుహాన్‌లో కరోనా వైరస్ మృత్యు ఘంటికలు మోగిస్తోంది.  ఇప్పటి వరకు ఈ ఒక్క నగరంలోనే దాదాపు 200 మంది కరోనా వైరస్ దెబ్బకు చనిపోయారు. మొత్తంగా చైనాలో ఇప్పటి వరకు కరోనా మృతుల సంఖ్య 361కి చేరింది. వేగంగా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుండడంతో ..చైనా ప్రభుత్వం కూడా దాన్ని ధీటుగా ఎదుర్కునేందుకు ఏర్పాట్లు చేసింది.

9 రోజుల్లో ఆస్పత్రి నిర్మాణం పూర్తి

వుహాన్ లో  ఆస్పత్రి నిర్మించాలని చైనా ప్రభుత్వం  నిర్ణయించింది. వుహాన్‌లో నిర్మితమైన ఈ ఆస్పత్రిని 10 రోజుల్లో నిర్మించాలని ప్రణాళిక వేశారు. కానీ రాత్రీపగలు పని చేసిన సిబ్బంది  కేవలం 9 రోజుల్లోనే దీన్ని నిర్మించడం విశేషం. తాత్కాలిక ప్రాతిపాదికన ఆస్పత్రి నిర్మించినప్పటికీ .. అన్ని రకాల సదుపాయాలు ఇందులో ఉండేలా చైనా వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంది. నేటి నుంచి కరోనా వైరస్ రోగులను చేర్చుకునేందుకు అందుబాటులోకి వచ్చింది. కేవలం కరోనా వైరస్ ఉన్న రోగులను మాత్రమే ఇందులో చేర్చుకుని వారికి చికిత్స చేస్తారు. భవిష్యత్తులోనూ ఇలాంటి వైరస్‌ల బారిన పడిన వారికి ఈ ఆస్పత్రిలో చికిత్స అందించే అవకాశం ఉంది. 

Trending News