China rejects Covid Origins: కొవిడ్‌ మూలాలపై అమెరికా నివేదిక అంతా తప్పు‌‌- చైనా

China says U.S. COVID origins report is without credibility:  తమపై దాడులు చేయొద్దంటూ అగ్రరాజ్యాన్ని చైనా కోరింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో మరోసారి దర్యాప్తునకు అంతర్జాతీయ నిపుణుల బృందం సిద్ధమవుతోన్న వేళ చైనా ఆందోళనకు గురవుతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 1, 2021, 09:18 AM IST
  • కొవిడ్‌ మూలాలపై అమెరికా నిఘా విభాగం రూపొందించిన నివేదికపై మండిపడ్డ చైనా
  • రాజకీయ, తప్పుడు నివేదికగా పేర్కొన్న చైనా
  • కొవిడ్‌ మూలాలపై అంతర్జాతీయ బృందం దర్యాప్తు చేపట్టడాన్ని వ్యతిరేకిస్తోన్న చైనా
China rejects Covid Origins: కొవిడ్‌ మూలాలపై అమెరికా నివేదిక అంతా తప్పు‌‌- చైనా

China rejects 'political, false' US report on Covid origins:కొవిడ్‌ మూలాలపై అమెరికా నిఘా విభాగం రూపొందించిన నివేదికపై చైనా మరోసారి మండిపడింది. కేవలం దాన్ని రాజకీయ, తప్పుడు నివేదికగా పేర్కొంది చైనా. ఈ విధంగా తమపై దాడులు చేయొద్దంటూ అగ్రరాజ్యాన్ని చైనా (China) కోరింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) ఆధ్వర్యంలో మరోసారి దర్యాప్తునకు అంతర్జాతీయ నిపుణుల బృందం సిద్ధమవుతోన్న వేళ చైనా ఆందోళనకు గురవుతోంది.

కొవిడ్‌ మూలాలపై ఆగస్టులో విడుదలైన నివేదికను వ్యతిరేకించామని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ (China Foreign Ministry Spokesman Wang Wenbin) తెలిపారు. ఆ నివేదికలో మార్పులు చేసి ఎన్ని రకాల కట్టుకథలు అల్లినా.. అది వారి రాజకీయ, తప్పుడు స్వభావాన్ని బయటపెడుతుందంటూ విమర్శించారు. 

Also Read : AP Formation Day: ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్, సీఎం జగన్

కొవిడ్‌ మూలాలను గుర్తించే పేరుతో అమెరికా నిఘా విభాగం చేసిన ప్రయత్నాలు రాజకీయం చేస్తుందనడానికి గట్టి నిదర్శనమన్నారు. ఈ నేపథ్యంలో చైనాపై దాడులు చేయడం, దుమ్మెత్తిపోసే చర్యలను ఆపివేయాలని వాంగ్‌ వెన్‌బిన్‌ (Wang Wenbin) కోరారు.

కొవిడ్‌ మూలాలపై 90రోజుల్లో నివేదిక ఇవ్వాలంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ (US President Joe Biden‌) అక్కడి నిఘా విభాగాన్ని ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు కొవిడ్‌ మూలాలపై అమెరికా నిఘా విభాగం (U.S. Department of Intelligence) రెండు నెలల కిందటే ఓ నివేదికను రూపొందించింది. కొవిడ్‌ మూలాలపై కొత్తగా ఎలాంటి సమాచారం లేనందున కచ్చితంగా ఓ తుది నిర్ణయానికి రాలేకపోతున్నట్లు అందులో పేర్కొంది అమెరికా (America) నిఘా విభాగం.

Also Read : Petrol Price Hike Today: మళ్లీ పెట్రో వాత.. వరుసగా ఆరో రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

ముఖ్యంగా జంతువుల (animals) నుంచి మానవులకు సోకిందా లేక ల్యాబ్‌ నుంచి లీక్‌ అయ్యిందా అనే విషయంపై స్పష్టత రాలేదని అమెరికా నిఘా విభాగం అభిప్రాయపడింది. అయితే మరోసారి దర్యాప్తును వ్యతిరేకిస్తోంది చైనా. అంతేకాదు కొవిడ్‌ మూలాలపై (Covid origins) అంతర్జాతీయ బృందం చైనాలో (China) దర్యాప్తు చేపట్టడాన్ని చైనా వ్యతిరేకిస్తోంది.

Also Read : T20 World Cup 2021: అది జరిగితే..టీమ్ ఇండియా సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News