YouTuber: భారీగా రిపేర్ బిల్లు వచ్చిందని.. రూ. 70 లక్షల విలువైన ఎలక్ట్రిక్ కారును పేల్చేసిన యూట్యూబర్!!

ఓ యూట్యూబర్ ఏకంగా రూ. 70 లక్షల విలువైన తన ఎలక్ట్రిక్ కారును తగలబెట్టాడు. ఎలక్ట్రిక్ కారు బ్యాటరీ ధరకు నిరసనగా.. టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ దిష్టిబొమ్మతో పాటు తన కారును డైనమైట్‌తో పేల్చేశాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 26, 2021, 08:49 AM IST
  • ఎలక్ట్రిక్ కారును పేల్చేసిన యూట్యూబర్
  • భారీగా రిపేర్ బిల్లు వచ్చిందని
  • టెస్లా కంపెనీకి భారీ ఎదురుదెబ్బ
 YouTuber: భారీగా రిపేర్ బిల్లు వచ్చిందని.. రూ. 70 లక్షల విలువైన ఎలక్ట్రిక్ కారును పేల్చేసిన యూట్యూబర్!!

Finland YouTuber blasts his own Tesla electric car due to high repair bill: ఓ యూట్యూబర్ (YouTuber ) ఏకంగా రూ. 70 లక్షల విలువైన తన ఎలక్ట్రిక్ కారును తగలబెట్టాడు. ఎలక్ట్రిక్ కారు బ్యాటరీ ధర (High Repair Bill)కు నిరసనగా.. టెస్లా సీఈఓ (Tesla CEO) ఎలోన్ మస్క్ దిష్టిబొమ్మతో పాటు తన కారును డైనమైట్‌తో పేల్చేశాడు. $22,000 రిపేర్ బిల్లు రావడంతోనే అసహనానికి గురైన ఆ యూట్యూబర్..  తన కారును పేల్చేశాడని డైలీ మెయిల్ తమ కథనంలో పేర్కొంది. ఈ ఘటన టెస్లా కంపెనీకి భారీ ఎదురుదెబ్బే అని చెప్పాలి. నిత్యం వార్తల్లో ఉండే టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ ఈ ఘటనపై ఎలా స్పందిస్తాడో చూడాలి. వివరాల్లోకి వెళితే... 

ఫిన్‌లాండ్‌కు చెందిన యూట్యూబర్ అయిన థామస్ కటైనెన్‌ (Tuomas Katainen)కు టెస్లా S మోడల్ 2012 మోడల్ ఎలక్ట్రిక్ కారు ఉంది. తాజాగా తన కారు బ్యాటరీ (Battery) సరిగా పనిచేయకపోవడంతో.. దగ్గరలో ఉన్న టెస్లా సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లాడు. బ్యాటరీ పూర్తిగా పాడయిపోయిదని, కొత్త బ్యాటరీ వేసుకోవాలి షో రూమ్ సిబ్బంది చెప్పారు. కొత్త బ్యాటరీ కోసం 22,000 డాలర్లు అవుతుందని తెలిపారు. స్థానిక యూట్యూబర్‌లను థామస్ సంప్రదించగా.. కొత్త కారు 100,000 డాలర్లకు వస్తుందని చెప్పారు. దాంతో తన కారును పేల్చివేసేందుకు సిద్దమయ్యాడు థామస్. అందుకు పక్కాగా ప్లాన్ చేశాడు.

Also Read: Todays Gold Rate: దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు

ఫిన్‌లాండ్‌లోని మంచుతో కూడిన భూభాగంలో థామస్ కటైనెన్‌ (Tuomas Katainen) తన టెస్లా S మోడల్ 2012ని 66 పౌండ్లు డైనమైట్‌తో పేల్చివేసాడు. కారులో టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ దిష్టిబొమ్మను కూడా పెట్టాడు. కారు పేల్చిన దృశ్యాలను థామస్ తన కెమెరాలో బంధించాడు. ఈ ఘటనకు సంబందించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పటికే టెస్లా కంపెనీ, సీఈఓ ఎలోన్ మస్క్ (Elon Musk)పై బ్యాటరీ విషయంలో చాలా ఫిర్యాదులు ఉన్నాయి. ఈ ఘటనతో టెస్లా కంపెనీకి భారీ ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. బ్యాటరీకి అయ్యే  ఖర్చులో నాలుగింట ఒక వంతు రీప్లేస్‌మెంట్‌లను మాత్రమే కంపెనీ ఇవ్వడమే ఇందుకు ప్రధాన కారణం. 

ఆటో-టెక్ వెబ్‌సైట్ ఎలక్ట్రిక్ నివేదిక ప్రకారం... అమెరికాలోని మరొక టెస్లా యజమానికి ఇదే విధంగా భారీ రిపేర్ బిల్ (High Repair Bill) అవుతుందని టెస్లా సర్వీస్ సెంటర్‌ అధికారులు చెప్పారట. టెస్లా సర్వీస్ సెంటర్‌లో బ్యాటరీ (Battery) రీప్లేస్‌మెంట్ కోసం 22,500 డాలర్ల ఖర్చవుతుందని చెప్పారట. దాంతో అతడు తన సొంత గ్యారేజీకి వేసుకెళ్లి.. 5,000 డాలర్ల బ్యాటరీని అమర్చాడు. దాని సామర్థ్యం టెస్లా బ్యాటరీ కంటే 70 శాతం ఎక్కువ వారంటీని కలిగి ఉందట. ఏదేమైనా ఇటీవలి కాలంలో టెస్లా పాత మోడళ్ల యజమానులు భారీ రిపేర్ బిల్లులను ఎదుర్కొంటున్నారు. 

Also Read: December 26 Horoscope: ఆదివారం ఆ రాశి వారు అనుకున్నదంతా జరుగుతుంది.. శుభవార్తలు వింటారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News