HMPV Virus: చైనా నుంచి వ్యాపించిన కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని ఎలా భయపెట్టిందో, ఎన్ని లక్షలమందిని బలితీసుకుందో అందరికీ తెలిసిందే. ప్రాణాలు హరిస్తూనే ఆర్ధిక వ్యవస్థల్ని కూడా తలకిందులు చేసింది. ఇప్పుడు మరోసారి హెచ్ఎంపీవీ రూపంలో ప్రమాదం ముంచుకురావచ్చని తెలుస్తోంది.
వివిధ రకాల వైరస్‌లకు పుట్టినిల్లుగా మారిన చైనా నుంచి మరో భయం ముంచుకొస్తోంది. ఇప్పుడు కొత్త రకం వైరస్ భయపెడుతోంది. హెచ్ఎంపీవీ పేరుతో ఉన్న వైరస్ చైనాలో విస్తృతంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే చైనాలో ఆసుపత్రులన్నీ రోగులతో నిండినట్టు అంతర్జాతీయ మీడియాలో వార్తలు ప్రచురితమౌతున్నాయి. చైనా ఈ విషయాన్ని ఖండిస్తున్నా భయం మాత్రం తీవ్రంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే చైనాలో ఇప్పటికే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు. హెచ్ఎంపీవీ వైరస్‌కు కూడా జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కన్పిస్తున్నాయనే ప్రచారం నడుస్తోంది. వ్యాధి తీవ్రమై శ్వాస ఆడక ప్రాణాలు పోగొట్టుకుంటున్నారనే నివేదికలు వస్తున్నాయి. ఈ వైరస్ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మాస్క్, శానిటైజర్ వినియోగాన్ని తప్పనిసరి చేశారు.
హెచ్ఎంపీవీ బాధిత రోగులతో ఆసుపత్రులు నిండటంతో ఇంట్లోనే ఉండి వైద్యం తీసుకుంటున్నారు. అత్యవసరమైతేనే ఆసుపత్రుల్లో చేర్చుకుంటున్నారు. కరోనా మహమ్మారి సమయంలో చేసినట్టే ఐసోలేషన్‌లో ఉంచుతున్నారు. వృద్ధులు, చిన్నారుల్లో ఈ వ్యాధి ఎక్కువగా కన్పిస్తోంది. ఈ వైరస్‌కు ఇంకా వ్యాక్సిన్ అందుబాటులో రాలేదు. కరోనా వైరస్ సమయంలో వాడిన మందులే వాడుతున్నారు. కరోనా తరహాలోనే అత్యంత వేగంగా విస్తరిస్తోంది. మరణాల సంఖ్య కూడా అధికంగానే ఉందని వార్తలు అందుతున్నాయి. ఇప్పటికే జపాన్, హాంకాంగ్ దేశాలకు ఈ వైరస్ విస్తరించగా పొరుగు దేశం ఇండియాకతు పెద్దఎత్తున ముప్పు పొంచి ఉంది.
Also read: AP Health Insurance: ఆరోగ్యశ్రీ అటెక్కినట్టేనా, ఏపీలో బీమా రంగ విధానం అమలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.