Rishi Sunak: బుద్ది పోనిచ్చుకోని భారతీయులు... గూగుల్ ట్రెండింగ్ లో రిషి సునక్ క్యాస్ట్ సెర్చింగ్

Rishi Sunak: భారతీయ మూలాలున్న రిషి సునక్ బ్రిటన్ కొత్త ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు.రిషి సునాక్  యూకే కొత్త పీఎం కావడంతో ఇండియాలో సంబరాలు అంబరాన్నంటాయి. అయితే కొందరు నెటిజన్ల బుద్ది మాత్రం మారలేదు. రిషి సునక్ ఎవరు? ఎక్కడి వారు? ఆయన కులం ఏంటీ అని ఆరా తీశారు.

Written by - Srisailam | Last Updated : Oct 25, 2022, 12:19 PM IST
  • యూకే నూతన ప్రధానిగా రిషి సునక్
  • గూగుల్ ట్రెండింగ్ లో సునక్ క్యాస్ట్ సెర్చ్
  • భారతీయుల నీచ బుద్ది మారదా?
Rishi Sunak: బుద్ది పోనిచ్చుకోని భారతీయులు... గూగుల్ ట్రెండింగ్ లో రిషి సునక్ క్యాస్ట్ సెర్చింగ్

Rishi Sunak: తరాలు మారినా భారతీయుల తలరాత మారదంటారు. మనకన్న చిన్న దేశాలు అభివృద్ధిలో దూసుకుపోతుంటే మనం మాత్రం అక్కడే ఉండిపోతున్నాం. దీనికి కారణం భారతీయుల తీరే. ప్రపంచ దేశాల్లో జనాలు అభివృద్ధి విషయంలో పోటీ పడుతుంటే.. భారతీయులు మాత్రం మతం, కులాల కుంపట్లలో మునిగిపోతున్నారు. హైటెక్ యుగంలో కులజాఢ్యం మరింత పెరిగిపోతోంది. దేశంలో ఎవరైనా పాపులర్ అయితే.. అతన్ని క్యాష్ చేసుకోవడానికి కుల సంఘాలు ప్రయత్నిస్తూ నీచంగా వ్యవహరిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇదీ మరింత ఎక్కువ. తెలుగు తేజం పీవీ సింధు     ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ గెలిచి భారతావనికి వన్నె తెస్తే.. గూగుల్ లో మాత్రం ఆమె రికార్డుల గురించి కాకుండా.. సింధు క్యాస్ ఏంటని వెతికారు తెలుగు ప్రజలు. అప్పట్లో గూగుల్ ట్రెండింగ్ లో సింధు క్యాస్ట్  సెర్చ్ నిలిచి భారత్ పరువు తీసింది. తాజాగా మరోసారి అలాంటి ఘటనే జరిగింది.

భారతీయ మూలాలున్న రిషి సునక్ బ్రిటన్ కొత్త ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. దీపావళి రోజున రిషి ఎన్నిక జరగడంతో భారతీయుల వెలుగులు పండుగ రెట్టింపు అయింది. రెండు శతాబ్దాలకు పైగా ఇండియాను పాలించిన బ్రిటీష్ ఎంపైర్ ను మన భారతీయుడే పాలించే రోజు రావడం నిజంగా మనందరికి గర్వకారణం.రిషి సునాక్  యూకే కొత్త పీఎం కావడంతో ఇండియాలో సంబరాలు అంబరాన్నంటాయి. అయితే కొందరు నెటిజన్ల బుద్ది మాత్రం మారలేదు. రిషి సునక్ ఎవరు? ఎక్కడి వారు? ఆయన కులం ఏంటీ అని ఆరా తీశారు. గత రెండు రోజులుగా గూగుల్ ట్రెండింగ్ లో రిషి సునక్ పేరే ట్రెండింగ్ లో నిలిచింది. ఇది భారతీయులుగా మనం సిగ్గుపడే విషయం.

ఇక రిషి సునక్ పేరుపైనా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. అతని పేరు సునక్ కాదు సౌనక్ అయి ఉంటుందని కొందరు హిందూ పేరు నిపుణులు చెబుతున్నారు. సునక్ అంటే సంస్కృతంలో  కుక్క అని అర్ధం.  సౌనక్ అంటే హిందూ పురాణాలలో ఒక సాధువు పేరు.  అందుకే రిషి సౌనక్ అయి ఉండవచ్చని వాదిస్తున్నారు. ఆయన ఎడ్యుకేషన్ రికార్డుల్లో పేరు తప్పుగా రాసి ఉండవచ్చని అంటున్నారు. మరికొందరు మాత్రం పంజాబ్ లో కొందరు సునక్ వంశస్తులు ఉన్నారని.. అది అతని పూర్వికుల పేరు అయి ఉండవచ్చని చెబుతున్నారు.

అయితే రిషి సునక్ కులం ఏంటో తెలియకపోయినా.. అతను భారతీయ బ్రహ్మణ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇన్ఫోసిస్ మాజీ చైర్మెన్ నారాయణ మూర్తి, సుధామూర్తిల అల్లుడు రిషి సునక్. రిషి సునక్ పక్కా శాఖాహారి. రిషిని దగ్గరగూ చూసిన వాళ్లు అతను బ్రాహ్మణ జీవితాన్ని గడుపుతున్నాడని చెబుతు్ననారు. అయితే బ్రాహ్మణుడు అని మాత్రం ఎవరూ నిర్ధారించలేదు.

Also Read : Rishi Sunak Interesting Facts: రిషి సునక్ గురించి చాలా మందికి తెలియని ఆసక్తికరమైన విషయాలు

Also Read : Virat Kohli: విరాట్ కోహ్లి సలహాను పాటించని అశ్విన్‌.. చాలా తెలివిగా పాకిస్థాన్‌కు చెక్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News